హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : 6 బంతుల్లో 6 సిక్సర్లు.. మొత్తంగా 16 సిక్సర్లు.. విధ్వంసం సృష్టించింది ఎవరో కాదు మనోడే..!

Viral Video : 6 బంతుల్లో 6 సిక్సర్లు.. మొత్తంగా 16 సిక్సర్లు.. విధ్వంసం సృష్టించింది ఎవరో కాదు మనోడే..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : క్రికెట్ (Cricket) లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. క్రికెట్ లో ఎవరైనా తమ ప్రదర్శనతో హీరో అవ్వొచ్చు.. అలాగే, విలన్ కూడా అవ్వొచ్చు. ఇక, లేటెస్ట్ గా ఛండీగఢ్ కు చెందిన జస్కరన్ మల్హోత్రా (Jaskaran Malhotra) హీరో అయ్యాడు.

ఇంకా చదవండి ...

  క్రికెట్ (Cricket) లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. క్రికెట్ లో ఎవరైనా తమ ప్రదర్శనతో హీరో అవ్వొచ్చు.. అలాగే, విలన్ కూడా అవ్వొచ్చు. ఇక, లేటెస్ట్ గా ఛండీగఢ్ కు చెందిన జస్కరన్ మల్హోత్రా (Jaskaran Malhotra) హీరో అయ్యాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఛండీగఢ్ కుర్రాడు అదరగొట్టాడు. అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా జస్కరన్ మల్హోత్రా నిలిచాడు. అయితే, అతను అమెరికా జాతీయ జట్టు తరఫున ఆడటం విశేషం. సాధారణంగా మనకు 6 బంతుల్లో 6 సిక్సర్లు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే ప్లేయర్.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh). 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ సిక్సర్ల మోత మోగించాడు. ఓవర్లోని ఆరు బంతులను మైదానం బయటకు పంపించి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను చాలా మందే బాదారు. విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌, శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా ఒకే ఓవర్లో ఆరు బంతులను మైదానం వెలుపలకు పంపారు. ఐపీఎ‍ల్‌ 14వ సీజన్‌లో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తృటిలో రికార్డును మిస్‌ అయినా.. తాజాగా భారత సంతతికి చెందిన ఓ క్రికెటర్​ అందుకున్నాడు.

  ఈ అరుదైన ఫీట్ అమెరికా, పఫువా న్యూగినియా మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఓమన్​ వేదికగా పపువా న్యూగినియా, అమెరికా జట్లు అంతర్జాతీయ వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అమెరికా ప్లేయర్స్ అందరూ విఫలమయినా.. భారత సంతతికి చెందిన జస్కరన్​ మల్హోత్రా భారీ ఇన్నింగ్స్ ఆడాడు.

  పపువా న్యూగినియా ఏ బౌలర్‌ను వదలకుండా బాదాడు. 124 బంతుల్లో 173 రన్స్ చేశాడు. మల్హోత్రా తన ఇన్నింగ్స్‌లో కేవలం 4 బౌండరీలు మాత్రమే బాది.. ఏకంగా 16 సిక్సులు కొట్టాడు. బౌండరీల ద్వారానే 100కు పైగా పరుగులు చేశాడు. ఈక్రమంలోనే ఒకే ఓవర్​లోని ఆరు సిక్సులు బాదాడు.

  అమెరికా ఇన్నింగ్స్​లోని ఆఖరి ఓవర్​ను పపువా న్యూగినియా పేసర్​ గౌడి టోకా వేశాడు. అదే ఓవర్​లోని ఆరు బంతులను జస్కరన్​ మల్హోత్రా ఆరు సిక్సర్లు బాది అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆ మ్యాచ్​లో 173 వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు మల్హోత్రా. దాంతో మల్హోత్రా అంతర్జాతీయ వన్డేలో రికార్డు నెలకొల్పాడు.

  ఇది కూడా చదవండి : ధోనీకి షాక్... టీమిండియా మెంటర్ గా నియామకంపై వివాదం..

  మల్హోత్రా దెబ్బకు గౌడి టోకా 7 ఓవర్లలోనే 66 రన్స్ సమర్పించుకున్నాడు. అమెరికా క్రికెట్​ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా అమెరికా క్రికెట్​ జట్టుకు వన్డే హోదా వచ్చిన తర్వాత సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్​మన్​గా ​ మల్హోత్రా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2019లో యూఏఈ వేదికగా జరిగిన వన్డేలో అరోన్​ జాన్స్​(95) శతకం దగ్గరగా వచ్చి ఔట్ అయ్యాడు. ఇక, ఈ ఫీట్ ను 2007 వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ ఓవర్లో హెర్షల్‌ గిబ్స్‌ 6 సిక్సర్లు కొట్టగా... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌ ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Sports, USA, Viral Video, Viral Videos, Yuvraj Singh

  ఉత్తమ కథలు