#HowdyModi | వచ్చే నెలలో ఇండియాకు రావొచ్చు... మోదీతో ట్రంప్

ఎన్బీయే ఇండియా గేమ్స్ 2019లో భాగంగా అక్టోబర్ 4, 5 తేదీల్లో బాస్కెట్ బాల్ మ్యాచ్ జరగనుంది. శాక్రమాంటో కింగ్స్ వర్సెస్ ఇండియన్ పేసర్స్ ఇందులో తలపడబోతున్నాయి.

news18-telugu
Updated: September 23, 2019, 12:45 AM IST
#HowdyModi | వచ్చే నెలలో ఇండియాకు రావొచ్చు... మోదీతో ట్రంప్
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. అమెరికాలోని హూస్టన్‌లో జరుగుతున్న #HowdyModi మెగా ఈవెంట్‌లో ట్రంప్ ప్రసంగించారు. ‘త్వరలో భారత్ ఓ వరల్డ్ క్లాస్ ఎన్బీయే బాస్కెట్ బాల్ మ్యాచ్‌ను చూడబోతోంది. వావ్ ఇది వినడానికి చాలా బాగుంది. వచ్చే వారం ముంబైలో వేలాది మంది తొలిసారి ఎన్బీయే గేమ్‌ను ఆస్వాదించబోతున్నారు. నన్ను ఆహ్వానిస్తున్నారా? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్? నేను రావొచ్చా?, బీ కేర్ ఫుల్, నేను రావొచ్చు.’ అని అన్నారు. ఎన్బీయే ఇండియా గేమ్స్ 2019లో భాగంగా అక్టోబర్ 4, 5 తేదీల్లో బాస్కెట్ బాల్ మ్యాచ్ జరగనుంది. శాక్రమాంటో కింగ్స్ వర్సెస్ ఇండియన్ పేసర్స్ ఇందులో తలపడబోతున్నాయి. ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దీనికి తాను రావొచ్చని ట్రంప్ చెప్పారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: September 23, 2019, 12:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading