హోమ్ /వార్తలు /క్రీడలు /

ఫెదరర్,షరపోవా ఔట్..కళ తప్పిన యూఎస్ ఓపెన్

ఫెదరర్,షరపోవా ఔట్..కళ తప్పిన యూఎస్ ఓపెన్

అమెరికన్ ఓపెన్‌లో నిరాశపరచిన షరపోవా, ఫెదరర్ (Reuters/Twitter )

అమెరికన్ ఓపెన్‌లో నిరాశపరచిన షరపోవా, ఫెదరర్ (Reuters/Twitter )

అమెరికన్ ఓపెన్‌ మెన్స్, ఉమెన్స్ సింగిల్స్‌ నుంచి రోజర్ ఫెదరర్,మారియా షరపోవా వంటి సూపర్ స్టార్స్ నిష్క్రమణతో టోర్నీ కళ తప్పింది.

అమెరికన్ ఓపెన్‌ మెన్స్, ఉమెన్స్ సింగిల్స్‌లో వరుస సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్స్ ఒక్కొక్కరు ఒక్కో రౌండ్‌తో ఇంటి దారి పడుతున్నారు. గ్రాండ్‌స్లామ్ కింగ్...స్విస్ ఏస్ రోజర్ ఫెదరర్, రష్యన్ టెన్నిస్ క్వీన్ మారియా షరపోవా సైతం ఈ జాబితాలో చేరారు.2018 యూ ఎస్ ఓపెన్ పోటీల్లో మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్‌ రోజర్ ఫెదరర్,ఉమెన్స్ సింగిల్స్‌ ఫేవరెట్‌ షరపోవా ప్రీ క్వార్టర్‌ఫైనల్‌తోనే నిష్క్రమించారు. సూపర్ స్టార్స్ నిష్క్రమణతో అమెరికన్  ఓపెన్ టోర్నీ కళ తప్పింది. మెన్స్ సింగిల్స్ నాల్గవ రౌండ్‌లో ఆస్ట్రేలియన్ అన్‌సీడెడ్ ప్లేయర్ జాన్ మిల్మన్ 2వ సీడ్‌గా బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్‌కు చెక్ పెట్టాడు. ఉమెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లో స్పానిష్ వెటరన్ కార్లా సారెజ్ నవారో..22వ సీడ్ షరపోవాను ఇంటిదారి పట్టించింది.

5 సార్లు అమెరికన్ ఓపెన్ చాంపియన్‌‌గా నిలిచిన ఫెదరర్‌పై జాన్ మిల్మన్ నాలుగు సెట్లలో పోరాడి నెగ్గి టెన్నిస్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరచాడు. 6-3తో తొలి సెట్ సొంతం చేసుకున్న ఫెదరర్‌ క్వార్టర్‌ఫైనల్ రౌండ్ చేరడం ఖాయమనుకున్నారంతా. సెకండ్ సెట్ నుంచి మిల్మన్ ఎదురుదాడికి దిగి వరుసగా మూడు సెట్లలో నెగ్గి గ్రాండ్‌స్లామ్ కింగ్‌ను చిత్తు చేశాడు. 3-6,7-5,7-6,7-6తో సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్‌ఫైనల్‌లో ఎంటరయ్యాడు.

ఉమెన్స్ సింగిల్స్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా పోటీకి దిగిన స్పెయిన్ వెటరన్ కార్లా సారెజ్ జోరు మీదున్న 22వ సీడ్ షరపోవాకు ఝలక్ ఇచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది.  అంతర్జాతీయ టెన్నిస్ నుంచి నిషేధం తర్వాత తిరిగి పూర్తి స్థాయిలో విజృంభిస్తున్న షరపోవా మరోసారి అమెరికన్ ఓపెన్ టైటిల్ సాధించలేకపోయినా.. కనీసం ఫైనల్ చేరుతుందని భావించారంతా.కానీ కార్లా సారెజ్ మాత్రం షరపోవాను ప్రీ క్వార్టర్‌ఫైనల్‌లోనే ఓడించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.6-4,6-3తో నెగ్గి టైటిల్ రేస్‌లో నిలిచింది.

ప్రస్తుత అమెరికన్ ఓపెన్‌ మెన్స్,ఉమెన్స్ సింగిల్స్‌లో టైటిల్ సాధిస్తారనుకున్న ఎంతో మంది స్టార్స్ ఫస్ట్ రౌండ్‌ నుంచే నిష్క్రమించి అభిమానులను నిరాశపరచారు. అంచనాలను అందుకోవడంలో విఫలమైన వారిలో మెన్స్ సింగిల్స్‌ నుంచి రోజర్ ఫెదరర్,బ్రిటన్ స్టార్ యాండీ ముర్రే, స్విట్జర్లాండ్ సంచలనం స్టానిలాస్ వావ్రింకా... ఉమెన్స్ సింగిల్స్‌ నుంచి రొమేనియన్ వండర్ సిమోనా హాలెప్, స్పానిష్ స్టార్ గర్బైన్ ముగురుజా,చెక్ రిపబ్లిక్ వెటరన్ పెట్రా క్విటోవా,వీనస్ విలియమ్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్‌: ఫెదరర్‌కు షాకిచ్చిన మిల్మన్


యూఎస్ ఓపెన్‌: ఉమెన్స్ సింగిల్స్‌ రేస్ నుంచి షరపోవా ఔట్

First published:

Tags: Roger Federer, Tennis, US Open 2018

ఉత్తమ కథలు