హోమ్ /వార్తలు /క్రీడలు /

US Open 2022 Winners List : యూఎస్ ఓపెన్ ను ముద్దాడిన లేడీ నడాల్.. వరుస సెట్లలో విజయం

US Open 2022 Winners List : యూఎస్ ఓపెన్ ను ముద్దాడిన లేడీ నడాల్.. వరుస సెట్లలో విజయం

PC : US Open/Twitter

PC : US Open/Twitter

US Open 2022 Winners List : టెన్నిస్ (Tennis) సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ (Us Open)లో పొలాండ్ (Poland) భామ ఇగా స్వియాటెక్ (Iga Swiatek) అదరగొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

US Open 2022 Winners List : టెన్నిస్ (Tennis) సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ (Us Open)లో పొలాండ్ (Poland) భామ ఇగా స్వియాటెక్ (Iga Swiatek) అదరగొట్టింది. మహిళల విభాగంలో యూఎస్ ఓపెన్ ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల స్వియాటెక్ 6-2, 7-6 (7/5)తో ట్యునీషియా భామ ఆన్స్ జేబుర్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్వియాటెక్ కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022)ను స్వియాటెక్ రెండు సార్లు నెగ్గింది. అంతేకాకుండా స్వియాటెక్ కు ఈ ఏడాది ఇది రెండో టైటిల్. జేబుర్ కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ లో రన్నరప్ గా నిలిచిన జేబుర్.. యూఎస్ ఓపెన్ లోనూ ఫైనల్ల ో ఓడి మరోసారి రన్నరప్ గా నిలిచింది.

స్వియాటెక్ దూకుడు

ఆట ఆరంభం నుంచే స్వియాటెక్ దూకుడు కనబర్చింది. బలమైన షాట్లతో జేబుర్ కు అవకాశం ఇవ్వలేదు. పదునైన సర్వీస్ తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. ఏకంగా ప్రత్యర్థి సర్వీస్ ను రెండు సార్లు బ్రేక్ చేసి తొలి సెట్ ను  6-2తో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్ లో మాత్రం జేబుర్ ప్రతిఘటించింది. వీరిద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. దాంతో మ్యాచ్ టై బ్రేక్ కు దారి తీసింది. ఇక్కడ కూడా ప్రతి పాయింట్ కోసం ఇరువురు ప్లేయర్స్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. అయితే కీలక సమయాల్లో పాయింట్లను గెలుచుకున్న స్వియాటెక్ తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్ గా అవతరించింది.

యూఓస్ ఓపెన్ ట్రోఫీని టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నడాల్ స్టయిల్ లో కొరుకుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది స్వియాటెక్. స్వియాటెక్ నడాల్ వీరాభిమాని కావడం విశేషం. నడాల్ ను చూసి టెన్నిస్ ను కెరీర్ గా ఎంచుకున్నట్లు కూడా స్వియాటెక్ చాలా సార్లు పేర్కొంది. యూఎస్ ఓపెన్ నెగ్గిన తర్వాత తన అభిమాన ప్లేయర్ నడాల్ ను అనుకరిస్తూ ‘ట్రోఫీ బైట్‘తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Serena Williams, Tennis, Us open, Wimbledon

ఉత్తమ కథలు