హోమ్ /వార్తలు /క్రీడలు /

Us Open 2022 : ఈమె అందంతోనే కాదు బీర్ తో కూడా.. ఎత్తిన బీర్ దించకుండా ఎలా తాగాలో ఈ అమ్మడు దగ్గరే నేర్చుకోవాలి (వీడియో)

Us Open 2022 : ఈమె అందంతోనే కాదు బీర్ తో కూడా.. ఎత్తిన బీర్ దించకుండా ఎలా తాగాలో ఈ అమ్మడు దగ్గరే నేర్చుకోవాలి (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

US Open 2022 : ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ లు అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కెమెరా కంటికి చిక్కే అందమైన అమ్మాయిలు మిస్టరీ గర్ల్స్ (mystery girl) అంటూ ట్రెండ్ కూడా అవుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

US Open 2022 : ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ లు అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కెమెరా కంటికి చిక్కే అందమైన అమ్మాయిలు మిస్టరీ గర్ల్స్ (mystery girl) అంటూ ట్రెండ్ కూడా అవుతారు. ఇక తాజాగా యూఎస్ ఓపెన్ (US Open) గ్రాండ్ స్లామ్ టోర్నీలో కూడా ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అయితే ఈమె తన అందంతో కాదు బీర్ తో అందరినీ తనవైపుకు తిప్పుకుంది. అమెరికాకు చెందిన మేగాన్ లక్కీ (Megan Lucky)కి టెన్నిస్ అంటే పిచ్చి. ఆమె న్యూయార్క్ (New York) వేదికగా జరిగే యూఎస్ ఓపెన్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తుంది కూడా. అయితే ఆమె అందరిలా కాకుండా డిఫెరెంట్ గా ప్రయత్నించి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యింది.

మేగాన్ గతేడాది యూఎస్ ఓపెన్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్లింది. మ్యాచ్ జరుగుతుండగా.. కెమెరామేన్ ఆమెపైకి తన కెమెరాను తిప్పాడు. కోర్టులో ఉన్న పెద్ద స్క్రీన్ పై తనను తాను చూసుకున్న ఆమె.. వెంటనే బాయ్ ఫ్రెండ్ చేతిలో ఉన్న బీర్ గ్లాస్ ను తీసుకుని గుట గుట తాగేసింది. ఎత్తిన గ్లాస్ ను కిందికి దించకుండా తాగేసింది. అంతే ఆమెకు ’బీర్ గర్ల్’ అనే బిరుదును కూడా ఇచ్చేశారు.
View this post on Instagram


A post shared by US Open (@usopen)


ఇక ఈ ఏడాది కూడా ఆమె యూఎస్ ఓపెన్ లో ఓ మ్యాచ్ కు హాజరైంది. సెప్టెంబర్ 4న జరిగిన మ్యాచ్ కు మేగాన్ వేళ్లింది. ఈసారి కూడా కెమెరామేన్ ఆమె వైపు తన కెమెరాను తప్పిగా.. వెంటనే బీర్ గ్లాస్ ను తాగడం మొదలు పెట్టింది. ఈసారి కూడా ఎత్తిన గ్లాస్ ను దించకుండా తాగేసింది. కేవలం 8 సెకన్లలోపూ గ్లాస్ ను ఖాళీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నాదల్ కు షాక్

23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటలో నాదల్ కు భారీ షాక్ తగిలింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్ లో నాదల్ 4-6, 6-4, 4-6, 3-6తో ఫ్రాన్సెస్ టియాఫె (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Beer, French open, India vs srilanka, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Serena Williams, Us open, Wimbledon

ఉత్తమ కథలు