హోమ్ /వార్తలు /క్రీడలు /

Serena Williams : టెన్నిస్ లో ముగిసిన ఒక శకం.. సొంత ప్రేక్షకుల మధ్య కన్నీటితో కెరీర్ కు వీడ్కోలు పలకిని నల్ల కలువ

Serena Williams : టెన్నిస్ లో ముగిసిన ఒక శకం.. సొంత ప్రేక్షకుల మధ్య కన్నీటితో కెరీర్ కు వీడ్కోలు పలకిని నల్ల కలువ

PC : TWITTER

PC : TWITTER

Serena Williams : టెన్నిస్ (Tennis)లో ఒక శఖం ముగిసింది. ఆస్ట్రేలియా (Australia) దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్గరెట్ కోర్టు (margaret court) అడుగు జాడల్లో రాకెట్ పట్టి అలాంటి ఆటతీరే కనబర్చిన అమెరికన్ టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ (Serena William) టెన్నిస్ కు వీడ్కోలు పలికింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Serena Williams : టెన్నిస్ (Tennis)లో ఒక శఖం ముగిసింది. ఆస్ట్రేలియా (Australia) దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్గరెట్ కోర్టు (margaret court) అడుగు జాడల్లో రాకెట్ పట్టి అలాంటి ఆటతీరే కనబర్చిన అమెరికన్ టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ (Serena William) టెన్నిస్ కు వీడ్కోలు పలికింది. కొన్ని నెలల క్రితం యూఎస్ ఓపెన్ (US Open) 2022తో తన టెన్నిస్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతకాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో సెరెనా విలియమ్స్ 7-5, 6-7 (4/7), 6-1తో ఆస్ట్రేలియా భామ అజ్లా తొమిజనోవిచ్ చేతిలో ఓడిపోయింది. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తుది వరకు పోరాడినా.. సెరెనాను ఓటమే పలకరించింది. ఈ మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో ప్రసంగించిన ఆమె.. మద్ధతుగా నిలిచిన అభిమానులను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొంది.

16 ఏళ్ల వయసులో అక్క వీనస్ విలియమ్స్ అడుగు జాడల్లో నడుస్తూ సెరెనా విలియమ్స్ ప్రొఫెషినల్ టెన్నిస్ ప్లేయర్ గా 1995లో అడుగుపెట్టింది. అయితే ఆరంభంలో పెద్దగా విజయాలు సాధించలేదు. అయితే 1999లో యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ను నెగ్గడంతో ఆమె తన టైటిల్ వేటను ఆరంభించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఆమె.. తన కెరీర్ లో ఏకంగా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నెగ్గింది. ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్టు (24) తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా సెరెనా ఉంది. టెన్నిస్ స్టార్లుగా ఉన్న రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెడరర్ కూడా సెరెనా కంటే తక్కువ టైటిల్స్ నెగ్గడం విశేషం. సెరెనా తన చివరి గ్రాండ్ స్లామ్ ను 2017లో నెగ్గింది. మార్గరెట్ కోర్ట్ రికార్డును సెరెనా బద్దలు కొడుతుందని భావించినా.. సెరెనా ఒక్క టైటిల్ దూరంలో నిలిచిపోయింది.

సెరెనా విలియమ్స్ తన కెరీర్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ను 7 సార్లు.. ఫ్రెంచ్ ఓపెన్ ను 3 సార్లు.. వింబుల్డన్ ను 7 సార్లు.. యూఎస్ ఓపెన్ ను 6 సార్లు నెగ్గింది. ఇక డబుల్స్ లో అక్క వీనస్ తో కలిసి బరిలోకి దిగిన ఆమె అక్కడ కూడా సంచలనాలను నమోదు చేసింది. డబుల్స్ విభాగంలో సెరెనా 14 గ్రాండ్ స్లామ్ లను నెగ్గింది. ఇవి కాకా.. నాలుగు ఒలింపిక్ బంగారు పతకాలను కూడా సాధించింది. 2012లో సింగిల్స్ విభాగంలో పసిడిని నెగ్గిన ఆమె.. 2000, 2008, 2012లలో డబుల్స్ లోనూ ఈ ఘనతను సాధించింది. సెరెనా విలియమ్స్ 2017 సెప్టెంబర్ 1న పండంటి ఆడ శిశువుగా జన్మ కూడా ఇచ్చింది. రెండు నెలల గర్భిణీగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలవడం సెరెనాకే సాధ్యమైంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Serena Williams, Tennis, Us open, Wimbledon

ఉత్తమ కథలు