హోమ్ /వార్తలు /క్రీడలు /

US Open 2022 Final : ఎవరు గెలిచినా చరిత్రే.. అంతేకాదు నంబర్ వన్ ర్యాంక్ కూడా..

US Open 2022 Final : ఎవరు గెలిచినా చరిత్రే.. అంతేకాదు నంబర్ వన్ ర్యాంక్ కూడా..

PC : TWITTER

PC : TWITTER

US Open 2022 Final : గత 15 ఏళ్లుగా టెన్నిస్ (Tennis) ప్రపంచంలో ముగ్గురు హవా మాత్రమే నడుస్తూ వస్తోంది. గ్రాండ్ స్లామ్ ఏదైనా సరే టైటిల్ మాత్రం రోజర్ ఫెడరర్ (Roger Federer), రాఫెల్ నడాల్ (Rafael Nadal), నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) ఖాతాల్లోకి మాత్రమే చేరేది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

US Open 2022 Final : గత 15 ఏళ్లుగా టెన్నిస్ (Tennis) ప్రపంచంలో ముగ్గురు హవా మాత్రమే నడుస్తూ వస్తోంది. గ్రాండ్ స్లామ్ ఏదైనా సరే టైటిల్ మాత్రం రోజర్ ఫెడరర్ (Roger Federer), రాఫెల్ నడాల్ (Rafael Nadal), నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) ఖాతాల్లోకి మాత్రమే చేరేది. మధ్యలో వావ్ రింకా, చిలిచ్, ముర్రే, మెద్వెదేవ్, డొమినిక్ థీమ్ లాంటి వాళ్లు అడపాదడపా గెలిచినా.. ఎక్కువ శాతం మాత్రం త్రయం చేతుల్లోకి వెళ్లేది. ప్రస్తుతం ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా తమ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఫెడరర్ కెరీర్ దాదాపుగా ముగియగా.. నడాల్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక జొకోవిచ్ మాత్రం పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడు. అయితే కరోనా వ్యాక్సిన్ కారణంగా ఆస్ట్రేలియా, యూఎస్ ఓపెన్ లలో ఆడటం లేదు.

ఇక ప్రస్తుతం యూఎస్ ఓపెన్ జరుగుతుంది. నాదల్ క్వార్టర్ ఫైనల్లో టియాఫే చేతిలో ఓడిపోయాడు. ఇక జొకోవిచ్ టోర్నీకి దూరంగా ఉండటం.. మెద్వెదేవ్ కూడా క్వార్టర్ లో వెనుదిరగడంతో ఈసారి కొత్త ప్లేయర్ ను గ్రాండ్ స్లామ్ విన్నర్ గా చూసే అవకాశం కలిగింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాగ గం. 1.30లకు ఆరంభమయ్యే పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్, నార్వే స్టార్ ప్లేయర్ క్యాస్పర్ రూడ్ లు తాడో పేడో తేల్చుకోనున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా సంచలనమే. అంతేకాకుండా వీరిలో టైటిల్ గెలిచిన ప్లేయర్ తొలి గ్రాండ్ స్లామ్ ను నెగ్గడంతో పాటు ప్రపంచనంబర్ వన్ ర్యాంక్ ను కూడా సొంతం చేసుకుంటారు.  ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లో ఫైనల్ చేరిన రూడ్ నడాల్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇక అల్కరాజ్ కు మాాత్రం ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్.

క్వీన్ స్వియాటెక్

మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో  21 ఏళ్ల స్వియాటెక్ 6-2, 7-6 (7/5)తో ట్యునీషియా భామ ఆన్స్ జేబుర్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్వియాటెక్ కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022)ను స్వియాటెక్ రెండు సార్లు నెగ్గింది. అంతేకాకుండా స్వియాటెక్ కు ఈ ఏడాది ఇది రెండో టైటిల్. జేబుర్ కు మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ లో రన్నరప్ గా నిలిచిన జేబుర్.. యూఎస్ ఓపెన్ లోనూ ఫైనల్ల ో ఓడి మరోసారి రన్నరప్ గా నిలిచింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Serena Williams, Us open, Wimbledon

ఉత్తమ కథలు