హోమ్ /వార్తలు /క్రీడలు /

Serena Williams : టెన్నిస్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన సెరెనా విలియమ్స్.. ఆ గాయంతో..

Serena Williams : టెన్నిస్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన సెరెనా విలియమ్స్.. ఆ గాయంతో..

Serena Williams (Photo Credit : Twitter)

Serena Williams (Photo Credit : Twitter)

Serena Williams : టెన్నిస్ (Tennis) లవర్స్ కు షాకిచ్చింది అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ (Serena Williams). ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ (US Open 2021)కు దూరమవుతున్నట్లు ప్రకటించింది.

  టెన్నిస్ (Tennis) లవర్స్ కు షాకిచ్చింది అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ (Serena Williams). ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ (US Open 2021)కు దూరమవుతున్నట్లు ప్రకటించింది. తన ఎడమ కాలి మడమ గాయం వల్ల ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు అందుబాటులో ఉండనని తెలిపింది సెరెనా. సొంత దేశంలో జరుగుతున్న ఈ గ్రాండ్ స్లామ్ కు సెరెనా విలియమ్స దూరమవ్వడం ఆ దేశ ఫ్యాన్స్ కు ఓ రకమైన షాక్ అనే చెప్పాలి. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో త‌న ఎడ‌మ కాలి మ‌డిమ ప‌ట్టేయ‌డంతో టోర్నీ నుంచి త‌ప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే, ఈ ఏడాది జరిగిన ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కూడా సెరెనా దూరమైంది. 24వ గ్రాండ్‌స్లామ్‌పై క‌న్నేసిన సెరీనాకు ఆ రికార్డు అంద‌ని ద్రాక్ష‌గా మారింది. 2017 త‌ర్వాత సెరీనా ఇప్ప‌టివ‌ర‌కు గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల‌వ‌లేదు." కాలి మడమ గాయం బాధపెడుతోంది. డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు దూరమవుతున్నాను. ఇది విచారకరమైన విషయమే. నా ఫేవరెట్ సిటీ న్యూయార్క్ లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ కు దూరమవ్వడం బాధ కల్గించే విషయమే. ఫ్యాన్స్ కేరింతలు మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నాను. మీరు చూపించే ప్రేమకు, సపోర్ట్ కి ధన్యావాదాలు " అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది సెరెనా విలియమ్స్.

  ఇక, ఇప్పటికే.. డిఫెండింగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ (Domenic Thiem) ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో వరల్డ్‌ నంబర్‌ 6 యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

  ఇది కూడా చదవండి : " నా తీరుకు సిగ్గుపడుతున్నా.. ఐయామ్ సారీ.. వారి పట్ల అలా చేసి ఉండకూడదు "


  మరోవైపు, గ్రాస్ కోర్ట్ సీజన్ సందర్భంగా దురదృష్టవశాత్తు స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌ (Roger Federer) మోకాలికి గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక వింబుల్డన్‌ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో ఈ ఆట‌గాడు మళ్లీ రాకెట్‌ పట్టలేదు. అయితే తాజాగా త‌న‌ పునరాగమనంపై ఫెడరర్ స్పందించాడు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఫెడ‌ర‌ర్ తాను యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశలు లేవ‌ని సోష‌ల్ మీడియాలో తెలిపాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ ఇటీవ‌ల చేసుకున్న‌ శస్త్రచికిత్స కార‌ణంగా వైద్యుల స‌ల‌హా మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపాడు. నాదల్ కూడా ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. స్టార్ ప్లేయర్లు మిస్సవ్వడంతో యూఎస్ ఓపెన్ కళ తప్పనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Rafael Nadal, Roger Federer, Serena Williams, Sports, Tennis

  ఉత్తమ కథలు