హోమ్ /వార్తలు /క్రీడలు /

US Open: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. మహిళల సింగిల్స్‌ టైటిల్ గెలుచుకున్న ఎమ్మా రుదికాను.. ఈ టోర్నికి ముందు ఆమె ర్యాంక్ ఎంతంటే..

US Open: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. మహిళల సింగిల్స్‌ టైటిల్ గెలుచుకున్న ఎమ్మా రుదికాను.. ఈ టోర్నికి ముందు ఆమె ర్యాంక్ ఎంతంటే..

ఎమ్మా రుదికాను(AP Photo/Elise Amendola)

ఎమ్మా రుదికాను(AP Photo/Elise Amendola)

యూఎస్ ఓపెన్(U.S. Open) మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటిష్ యువకెరటం 18 ఏళ్ల ఎమ్మా రదుకాను(Emma Raducanu) సొంతం చేసుకుంది.

యూఎస్ ఓపెన్(U.S. Open) మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటిష్ యువకెరటం 18 ఏళ్ల ఎమ్మా రదుకాను(Emma Raducanu) సొంతం చేసుకుంది. ఫైనల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను(Leylah Fernandez) 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఎమ్మా రుదకాను.. తన కేరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్(Grand Slam) టైటిల్‌ను గెలుచుకుంది. ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇద్దరు ఆన్‌సీడెడ్ క్రీడాకారిణులు.. ఫైనల్‌ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో 150వ ర్యాంక్‌లో ఉన్న ఎమ్మా రుదకాను.. తనకన్నా మెరుగైన స్థానంలో ఉన్న 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. ఈ విక్టరీ ద్వారా ఎమ్మా.. చరిత్ర సృష్టించింది. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 1977 లో వింబుల్డన్‌లో వర్జీనియా వేడ్ విజయం సాధించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటన్‌ మహిళగా అరుదైన రికార్డును ఎమ్మా తన ఖాతాలో వేసుకుంది.

17 ఏళ్లలో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఎమ్మా రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ప్రముఖ క్రీడాకారిణి మారియా షరపోవా(Maria Sharapova) 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచింది. రుదుకాను జర్నీలో అన్నింటి కంటే విశేషం ఏమిటంటే.. ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌లు ఎదుర్కొన్న ఎమ్మా.. ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. మొత్తం 20 సెట్లలోనూ నెగ్గడం విశేషం. ఇక టైటిల్‌ గెలిచిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది.

ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. రెండో సెట్‌లో కూడా అదే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రెండో సెట్‌ను ఎమ్మా.. 6-3 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో వరుస సెట్లలో విజయం సాధించిన ఎమ్మా.. తన కేరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ను సాధించింది. గ్రాండ్ స్లామ్ విజయం సాధించిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ విక్టరీతో ఎమ్మా ర్యాంకింగ్‌లో.. 150 నుంచి 23కి చేరింది. అంటే ఒకేసారి 127 ర్యాంకులు ఎగబాకింది.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసకున్న ఎమ్మా రుదుకానును..బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్- II అభినందించారు. ఇక, రుదకాను కెనడాలో జన్మించినప్పటికీ.. ఆమెకు రెండు ఏళ్లు ఉన్నప్పుడే ఆమె కుటుంబం ఇంగ్లాండ్‌కు షిఫ్ట్ అయింది.

First published:

Tags: Britain, Us open

ఉత్తమ కథలు