స్టైలిష్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అంటూ వార్తలు రావడంపై బాలివుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు గాసిప్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు చెడిపోయే అవకాశం ఉందని, వార్తలు రాసేముందు ముందు ఆలోచించాలని హితవు పలికింది. తనకూ ఒక కుటుంబం ఉందని, వారికి తాను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసి తనకు సమస్యలు తెచ్చిపెట్టవద్దని కోరింది. ఇదిలా ఉంటే బాలివుడ్ భామ ఊర్వశి రౌటేలా ఆగ్రహానికి ఓ వీడియో ఆమె కంట పడడమే కారణమైంద. అందులో ఊర్వశి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ నుంచి సాయం కోరుతోంది అనే శీర్షికతో సోషల్ మీడియాలో సదరు వీడియో ప్రత్యక్షమైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఊర్వశి దానిని స్క్రీన్‌షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఇలాంటి నిరాధార వార్తలు రాసి తనన ఇబ్బందులకు గురిచేయవద్దని కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Urvashi Rautela