పాండ్యతో రిలేషన్‌పై... మీడియాకు బాలీవుడ్ హీరోయిన్ వార్నింగ్

‘ఊర్వశి తన మాజీ ప్రియుడు హర్దిక్‌ పాండ్య సాయం కోరారా?’ అని వార్త రాసింది. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

news18-telugu
Updated: July 30, 2019, 10:49 AM IST
పాండ్యతో రిలేషన్‌పై... మీడియాకు బాలీవుడ్ హీరోయిన్ వార్నింగ్
పాండ్య, ఊర్వశి రతౌల
news18-telugu
Updated: July 30, 2019, 10:49 AM IST
బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెల.. సనమ్‌రే సినిమాతో అందరూ మనసు దోచుకుంది. హేట్ స్టోరీ 4లో నటించి అందరు మతులు పొగొట్టింది ఈ హాట్ భామ.అయితే తాజాగా మీడియాపై సెక్సీ బ్యూటీ భగ్గుమంది. తనపై రాస్తున్న వార్తలపై ఫైర్ అయ్యింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. ఊర్వశికి మాజీ ప్రియుడు అంటూ ఓ హిందీ   వార్తా పత్రిక వార్తను ప్రచురించింది. 

‘ఊర్వశి తన మాజీ ప్రియుడు హర్దిక్‌ పాండ్య సాయం కోరారా?’ అని వార్త రాసింది. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో ఊర్వశి వరకు విషయం వచ్చింది. దీంతో ఆ మీడియా సంస్థ ప్రచురించిన వార్తను ఊర్వశి తప్పుపట్టింది. మీడియా  ఇలాంటి పిచ్చి వార్తలను ప్రచురించొద్దని వేడుకుంటున్నాను. వీటి వల్ల కుటుంబ కలహాలు వస్తాయి. రేపు ఏదన్నా జరిగితే నా కుటుంబానికి నేను జవాబు చెప్పుకోలేను’ అని పేర్కొన్నారు. గతంలో పలు పార్టీలకు పాండ్య, ఊర్వశి కలిసే వెళ్లేవారు. దాంతో వారు డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు ప్రచురితమయ్యాయి. హేట్ స్టోరీ 4 తర్వాత తాజాగా  ‘పాగల్ పంటీ’ అనే సినిమాలో నటిస్తోంది. జాన్ అబ్రహమ్, ఇలియానా, అనిల్ కపూర్, అర్షద్ వాసీ నటిస్తున్నారు.


First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...