UPPAL STADIUM TURNS DARK OVER NON PAYMENT OF ELECTRICITY BILLS CHECK DETAILS JNK
Uppal Stadium Power Cut: ఉప్పల్ స్టేడియంకు కరెంట్ కట్ చేసిన TSSPDCL.. ఎంత బకాయి పడ్డారో తెలుసా?
భారీగా బకాయిలు.. ఉప్పల్ స్టేడియంకు కరెంట్ కట్ చేసిన అధికారులు (BCCI)
Uppal Stadium Power Cut: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు TSSPDCL అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గత మూడేళ్లుగా భారీగా విద్యుత్ బకాయిలు పేరుకొని పోవడంతో.. కోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు.
హైదరాబాద్‌లోని హబ్సిగూడ సర్కిల్ పరిధిలో ఉన్న ఉప్పల్ స్టేడియం బిల్లును గత కొన్ని ఏళ్లుగా చెల్లించక పోవడంతో తెలంగాణ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏకు చెందిన HBG2192 కనెక్షన్‌పై పెండిగ్ బిల్లుల బకాయిల కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో 2018లో కేసు కూడా వేశారు. దీంతో డిఫాల్టర్‌గా ఉన్న హెచ్‌సీఏ పెండింగ్ బిల్లు రూ. 1.41 కోట్లతో పాటు రూ. 1.64 కోట్ల సర్‌చార్జి కలిపి రూ. 3.05 కోట్లు వారం రోజుల లోగా చెల్లించాలని డిసెంబర్ 6న కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన వారం తర్వాత కూడా బిల్లులు చెల్లించకపోవడంతో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు బుధవారం స్టేడియంకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అంధకారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం (Photo: News18)
హెచ్‌సీఏ అధికారులపై ఇప్పటికే విద్యుత్ చౌర్యం కేసును కూడా నమోదు అయ్యింది. పలుమార్లు బకాయిలు చెల్లించాలని కోరినా లెక్క చేయలేదు. దీంతో అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్నారని చెబుతూ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు. కాగా, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ వర్గం గత కొన్నాళ్లుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పదవుల కోసం అస్తమానం కొట్టుకోవడం తప్ప హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న స్టేడియంలు, గ్రౌండ్లను అభివృద్ది చేయాలనే ప్రణాళిక లేకుండా పోయింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఉప్పల్ స్టేడియంను కూడా గత కొన్నాళ్లుగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌కు కేటాయించాల్సిన పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు వైజాగ్‌కు తరలిపోతున్నా హెచ్‌సీఏకు చీమకుట్టినట్లు కూడా లేదు. గత రెండేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా జరగలేదు. అయితే వచ్చే సీజన్లో మాత్రం కనీసం 8 మ్యాచ్‌లు ఈ గ్రౌండ్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో స్టేడియం బాగోగుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మరోవైపు ఈ విద్యుత్ చౌర్యం కేసుపై ఇంత వరకు హెచ్‌సీఏ స్పందించలేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.