HBD Sania Mirza : ఇటీవల ఉపాసనా కొణిదెల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ప్రతీ అకేషన్నూ ఆమె తనదైన శైలిలో నెటిజన్లతో పంచుకుంటున్నారు. తాజాగా సానియా మీర్జాకు ఆమె విషెస్ చెప్పిన విధానం అందరికీ నచ్చేస్తోంది.
Happy Birth Day Sania Mirza : ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... 34వ బర్త్ డే జరుపుకుంటోంది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. వారంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐతే... వారందర్లోకీ... ఉపాసనా కొణిదెల ట్విట్టర్లో చెప్పిన విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. "నా ఫిట్నెస్కి నువ్వే ఇన్స్పిరేషన్" అంటూ సానియా మీర్జాను మెచ్చుకున్న ఉపాసన... "నేను ఫిట్‌గా ఉండేలా హెల్ప్ చేసినందుకు థాంక్స్" అని చెప్పారు. అంతేకాదు... "పుట్టిన రోజు నాడు నిన్ను మిస్సయ్యాను... త్వరలోనే జిమ్‌లో కలుద్దాం... పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని స్వీట్ ట్వీట్ చేశారు ఉపాసన. ఇప్పుడీ ట్వీట్... వైరల్ అయిపోయింది. ఇప్పటికే దీన్ని వెయ్యి మందికి పైగా లైక్ చెయ్యగా... 70 మంది రీట్వీట్ చేశారు. ఇంకా చాలా మంది దీన్ని షేర్ చేస్తున్నారు.
తన కెరీర్లో 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచిన ఈ హైదరాబాదీ సంచలనం... 2003 నుంచీ 2013లో సింగిల్స్ నుంచీ రిటైర్ అయ్యేవరకూ... WTA ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచీ నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచింది. మొత్తంగా ఇండియాలో హైఎస్ట్ పెయిడ్, హై-ప్రొఫైల్ అథ్లెట్‌గా ఆమే నిలవడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.