హోమ్ /వార్తలు /క్రీడలు /

Olympics : ఒలింపిక్స్‌కు అథ్లెట్‌గా వెళ్లనున్న జిల్లా కలెక్టర్.. యూపీ కలెక్టర్ సుహాస్ సరికొత్త రికార్డు

Olympics : ఒలింపిక్స్‌కు అథ్లెట్‌గా వెళ్లనున్న జిల్లా కలెక్టర్.. యూపీ కలెక్టర్ సుహాస్ సరికొత్త రికార్డు

పారాలింపిక్స్‌కు వెళ్లనున్న ఐఏఎస్ అధికారిక యతిరాజ్

పారాలింపిక్స్‌కు వెళ్లనున్న ఐఏఎస్ అధికారిక యతిరాజ్

యూపీలో జిల్లా మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ పారాలింపిక్స్‌కు అథ్లెట్‌గా వెళ్లనున్నారు. పారా-బ్యాడ్మింటన్ వరల్డ్ నెంబర్ 3 ర్యాంకులో ఉన్న యతిరాజ్ తప్పకుండా పతకం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు.

  టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అవి ముగిసిన వెంటనే అగస్టు 24 నుంచి అక్కడే పారాలింపిక్స్ (Paralympics 2020) కూడా ప్రారంభం కానున్నాయి. పారా ఒలింపిక్స్‌కు ఇండియా నుంచి వెళ్లే బృందంలో ఒక ఐఏఎస్ అధికారి (IAS Officer) కూడా ఉన్నాడు. అయితే ఆయన ఏ మ్యాచ్ అఫీషియల్‌గానో పారాలింపిక్స్‌కు వెళ్లడం లేదు. బ్యాడ్మింటన్‌కు అర్హత సాధించి పతకాల సాధన కోసం వెళ్తున్నాడు. ఆయనే యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ (Suhas Yatiraj). పారా-బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన సుహాస్ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 3వ ర్యాంకులో ఉన్నాడు. రెండేళ్ల క్రితమే అతను పారాలింపిక్స్‌కు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ముందుగా అర్హత సాధించడానికి చాలా కష్టపడ్డాడు. ఒకవైపు కలెక్టర్‌గా బాధ్యతలు, మరోవైపు అథ్లెట్‌గా పతకం సాధించాలనే ఆశ. గత ఏడాదిన్నరగా పగలు కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాత్రి పూట బ్యాడ్మింటన్‌ను తీవ్రంగా సాధన చేశాడు. రెండింటి పట్ల ఉన్న అంకిత భావం, ప్రేమే తనను ఇలా నడిపించాయని సుహాస్ అంటున్నాడు. అందరు అథ్లెట్ల లాగానే రాబోయే పారా ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించాలని ఆశ పడుతున్న సుహాస్ రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. విజయాలకు, వైఫల్యాలకు తేడా చాలా చిన్నగా ఉంటుంది. కేవలం సెంటీ మీటర్, మిల్లీమీటర్ల తేడాతో తాను కూడా చాలా సార్లు ఓటమి పాలయ్యానని సుహాస్ చెబున్నాడు.

  2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ యతిరాజ్ ప్రస్తుతం కోవిడ్ నియంత్రణ సేవల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో అతను ఢిల్లీకి సరిహద్దులో ఉన్న గౌతమ్ బుద్ద నగర్ జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యతిరాజ్ చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకున్నాడు. 2016 ఏసియన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం, బీడబ్ల్యూఎఫ్ టర్కిష్ ఓపెన్ చాంపియన్‌షిప్స్ 2017లో మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2018లో వారణాసిలో జరిగిన నేషనల్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. 2019లో జరిగిన టర్కిష్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణ పతకం సాధించి పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. యూపీ ప్రభుత్వం అతడిని యష్ భారతి అవార్డుతో సత్కరించింది.


  కోవిడ్ కారణంగా పారాలింపిక్స్ ఏడాది వాయిదా పడ్డాయి. ఈ సమయంలో తాను ప్రజల సేవలో నిమగ్నమయ్యానని.. అయినా సరే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మాత్రం వీడలేదని సుహాస్ చెబుతున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సుహాస్ తప్పకుండా మంచి ప్రదర్శన చేసి పతకం సాధిస్తానని అంటున్నాడు.

  Published by:John Kora
  First published:

  Tags: Olympics, Tokyo Olympics

  ఉత్తమ కథలు