Home /News /sports /

UNIVERSAL BOSS CHRIS GAYLE SLAMS WEST INDIES LEGEND PLAYER CURTLY AMBROSE FOR THIS REASON SRD

Chris Gayle : " ఆ దిగ్గజ క్రికెటర్ పై ఉన్న గౌరవం చచ్చిపోయింది " .. క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు..

Chris Gayle

Chris Gayle

Chris Gayle : ఇక, క్రికెట్ మైదానంలో, వెలుపలా క్రిస్ గేల్ ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు. తన సరదా చేష్టలతో అందరి చేత నవ్వులు పూయిస్తాడు. క్రిస్ గేల్ ఇతర క్రికెటర్లతో గొడవపడ్డ సందర్భాలు చాలా అరుదే అని చెప్పవచ్చు.

    క్రిస్ గేల్.. (Chris Gayle) క్రికెట్ (Latest Cricket News) ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీ-20 క్రికెట్ లో అతను ఓ లెజెండ్. ధనాధన్ గేమ్ తో బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక, క్రికెట్ మైదానంలో, వెలుపలా క్రిస్ గేల్ ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు. తన సరదా చేష్టలతో అందరి చేత నవ్వులు పూయిస్తాడు. క్రిస్ గేల్ ఇతర క్రికెటర్లతో గొడవపడ్డ సందర్భాలు చాలా అరుదే అని చెప్పవచ్చు. అలాంటి క్రిస్ గేల్ తన దేశానికే చెందిన దిగ్గజ క్రికెటర్ పై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్లితే..వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కర్ట్‌లీ అంబ్రోస్‌ (Curtly Ambrose)పై విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ విరుచుకుపడ్డాడు. అంబ్రోస్‌పై తనకున్న గౌరవం చచ్చిపోయిందని, అతనితో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ ఆరంభంలో అంబ్రోస్‌ను ఎంతో గౌరవించేవాడినని, కానీ అతను మాత్రం గత కొద్దికాలంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తెలిపాడు. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదని గేల్ చెప్పుకొచ్చాడు.

    అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నాడా? అనేది అర్థం కావడం లేదని, ఒకవేళ అంబ్రోస్ అదే కోరుకుంటే తనకు కావాల్సింది ఇస్తానని గేల్ చెప్పాడు. అతని ప్రతి విమర్శను తిప్పికొడుతానని చెప్పకనే చెప్పాడు.యూఏఈ వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్‌కు చోటు కల్పించడాన్ని కర్ట్‌లీ అంబ్రోస్ తప్పబట్టాడు. ఫామ్‌లో లేని అతన్ని అనవసరంగా ఎంపిక చేశారని, ఇది ఏమాత్రం బాలేదని వెస్టిండీస్ క్రికెట్ సెలెక్టర్లను అంబ్రోస్ విమర్శించాడు.

    ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గేల్ ఎంపిక కేవలం ఓ సీనియర్ బ్యాట్స్‌మన్‌గానే జట్టులోకి తీసుకున్నారన్నాడు. తానే సెలెక్టర్ అయితే కచ్చితంగా గేల్‌ను పక్కనపెట్టేవాడినని చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో తీవ్రంగా హర్ట్ అయిన గేల్.. ఓ రేడియో చానెల్‌తో మాట్లాడుతూ అంబ్రోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    "నాకు అంబ్రోస్‌ ఉన్న గౌరవం చచ్చిపోయింది. జట్టులోకి నేను కొత్తగా వచ్చినప్పుడు అతనికి నేనిచ్చిన గౌరవం వేరుగా ఉండేది. కానీ ఈరోజు నాపై అతను చేసిన వ్యాఖ్యలతో చాలా హార్ట్ అయ్యాను. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటి నుంచి వ్యక్తిగతంగా నాపై మాటల యుద్దం చేస్తున్నాడు. ఒక యూనివర్సల్‌ బాస్‌గా ఈ రోజుతో కర్ట్‌లీ అంబ్రోస్‌తో తెగదెంపులు చేసుకుంటున్నా. ఒకవేళ అతను నాకు ఎదురుపడితే కూడా ఇదే మాట చెబుతా. నాపై నెగెటివ్‌ ప్రచారం ఆపండి. టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌ గెలవాలని కోరుకోండి "అంటూ గేల్ చురకలంటించాడు.

    క్రిస్ గేల్ - కర్ట్ లీ అంబ్రోస్


    ఇక పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ జట్టుకు ఘనమైన రికార్డు ఉంది. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత వెస్టిండీస్‌కు దక్కింది. 2012, 2016లో టి20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ జట్టులో గేల్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2021 ఏడాది ఆరంభం నుంచి చూసుకుంటే 16 టి20 మ్యాచ్‌లాడి 227 పరుగులు మాత్రమే చేశాడు.

    ఇది కూడా చదవండి : స్మృతి మంధానకు గోల్డెన్ ఛాన్స్.. త్వరలోనే కొత్త బాధ్యతలు..!

    ఇందులో ఒక్క హాఫ్‌ సెంచరీ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఐపీఎల్‌ 2021 సీజన్‌ సెకండ్‌ఫేజ్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గేల్‌ ఆ తర్వాత బయోబబుల్‌ను వీడాడు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్‌ ఫామ్‌లోకి వచ్చేందుకు ఒక్క మ్యాచ్‌ చాలు. అతను ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించడం ఖాయం. ఇక, లేటెస్ట్ గా ధనాధన్ వరల్డ్ కప్ కోసం.. ఐపీఎల్ నుంచి క్రిస్ గేల్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chris gayle, Cricket, T20 World Cup 2021, West Indies

    తదుపరి వార్తలు