• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • UNIVERSAL BOSS CHRIS GAYLE PARTYING WITH GIRLS SEEN WITH RAPPER EMIWAY BANTAI JNK

IPL 2021 : అమ్మాయిలతో కలసి చిందేసిన యూనివర్సల్ బాస్.. మ్యాచ్‌కు ముందే ఫుల్ జోష్‌లో గేల్

IPL 2021 : అమ్మాయిలతో కలసి చిందేసిన యూనివర్సల్ బాస్.. మ్యాచ్‌కు ముందే ఫుల్ జోష్‌లో గేల్

ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే క్రిస్ గేల్ పార్టీలో చిందులు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), పంజాబ్ కింగ్స్(Punjab Kungs) మధ్య తొలి మ్యాచ్ సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే (Wankhade) స్టేడియంలో జరుగనున్నది. పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. మామూలుగా క్రిస్ గేల్‌ను అందరూ పార్టీ బాయ్ అని పిలుస్తుంటారు. మ్యాచ్ లేకపోతే ఎప్పుడూ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. అయితే ఈ సారి తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే పార్టీ, అమ్మాయిలు అంటూ స్నేహితులతో కలసి చిందేస్తున్నాడు. కానీ అది నిజమైన పార్టీ కాదు. ప్రముఖ ఇండియన్ ర్యాపర్ ఎమివే బాంటాయ్‌తో కలసి ఒక వీడియోలో కనిపించాడు. ఇటీవల మూన్ వాక్, దలేర్ మెహందీ వీడియోల్లో కనిపించిన క్రిస్ గేల్.. తాజాగా ఒక ర్యాప్ సాంగ్‌లో గొంతు కలపడంతో పాటు రెండు స్టెప్పులు కూడా వేశాడు. 'జమైకా టూ ఇండియా' (Jamaica to India) అనే ఈ సాంగ్‌లో గేల్ చాలా జోష్‌గా కనిపించాడు.

    ఈ వీడియోలో పలువురు యువతులు బికినీలతో డ్యాన్స్ చేస్తుండగా.. గేల్ చేతిలో వైన్ గ్లాస్‌తో స్టెప్స్ వేస్తూ కనిపించాడు. ఈ వీడియోలో గేల్ తన సింగింగ్ ట్యాలెంట్‌ను కూడా చూపించాడు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను గేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కరేబియన్ దీవులకు చెందిన ప్రతీ క్రికెటర్ ఇలా ఆటపాటలతో అలరిస్తుంటారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రావో చాలా మంచి సింగర్. అతడు రూపొందించిన 'బ్రావో' పాట చాలా ఫేమస్. సీఎస్కేకు చెందిన కార్యక్రమాల్లో ఆ పాటను ఎక్కువగా పాడేవాళ్లు. ఇక సునిల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, నికొలస్ పూరన్ వంటి కరేబియన్ క్రికెటర్లు ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. కానీ, వారందరి కంటే ముందుండేది క్రిస్ గేల్ మాత్రమే.






    పంజాబ్ కింగ్స్ తరపున గత సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌లే ఆడిన క్రిస్ గేల్ 288 పరుగులు సాధించాడు. అతడిని చాలా మ్యాచ్‌లకు బెంచ్‌పై కూర్చోబెట్టి పంజాబ్ అనేక మ్యాచ్‌లు ఓడిపోయింది. గేల్ వచ్చిన తర్వాతే పంజాబ్ విజయాలు సాధించడం మొదలు పెట్టింది. అయితే ఈ సారి గేల్ మొదటి మ్యాచ్ నుంచే తుది జట్టులో ఉండే అవకాశం ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు