• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • UNION BUDGET NIRMALA SITHARAMAN PRAISES TEAM INDIAS GREAT SUCCESS IN AUSTRALIA DURING BUDGET SPEECH SRD

Union Budget 2021 : బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ నోట..టీమిండియా మాట..

Union Budget 2021 : బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ నోట..టీమిండియా మాట..

Union Budget 2021

Union Budget 2021 : కేంద్ర ప్రభుత్వం టీమిండియా ఆట తీరును సందర్భం వచ్చినప్పుడల్లా కొనియాడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి తన బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా ప్రస్తావన తీసుకొచ్చారు.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం టీమిండియా ఆట తీరును సందర్భం వచ్చినప్పుడల్లా కొనియాడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి తన బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా ప్రస్తావన తీసుకొచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆ దేశ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు అందుకున్న అపూర్వ విజయాన్ని గుర్తుచేశారు. ఆస్ట్రేలియాలో టీమిండియా ఇటీవల సాధించిన చారిత్రక విజయం తర్వాత క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే దేశంగా మనం అనుభవించిన ఆ ఆనందాన్ని తాను మళ్లీ గుర్తు చేయలేనని మంత్రి పేర్కొన్నారు. విజయం సాధించాలన్న అమితమైన ఆకాంక్ష మన కుర్రాళ్లలో కనిపించిందని కొనియాడారు. ఓవైపు ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా సమయాత్తం అవుతుండగా.. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన చారిత్రాత్మక విజయం హాట్ టాపిక్ అవుతోంది. ఆదివారం మన్‌ కీ బాత్‌లో దేశ ప్రధాని నరేంద్రమోదీ టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని కొనియాడగా.. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ కూడా టీమిండియా విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.

    సోమవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నమ్మకం యొక్క ప్రాముఖ్యత తెలియజేసేందుకు రవీంద్రనాధ్ ఠాగూర్ కొటెషన్ ఒకటి చెప్పిన ఆమె.. టీమిండియా విజయాన్ని సైతం ప్రస్తావించారు. " ఆస్ట్రేలియాలో టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించడం పట్ల క్రికెట్​ను ప్రేమించే దేశంగా మనమెంతో ఆనందించాం. యువతకు ఎలాంటి మద్దతు ఇస్తున్నామో అనేది ఈ విజయం గుర్తుచేస్తుంది." అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

    ఇక ఆస్ట్రేలియా గడ్డపై.. టీమిండియా పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. గాయాలు వెంటాడుతున్నా, సీనియర్ ప్లేయర్స్ లేకపోయినా టీమిండియా 2-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ చరిత్రాత్మక విజయంలో కుర్రాళ్ల పాత్ర ఎక్కువే. ఇక మోదీ ప్రశంసలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కృతజ్ఞతలు తెలియజేసింది . "మీ ప్రశంసలకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు మోదీజీ.. భారత త్రివర్ణ పతాకం ఎగురుతూనే ఉండేందుకు మా సాయశక్తుల ప్రయత్నిస్తాం," అని ట్వీట్ చేసింది. ఇక భారత్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభంకానుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు