U-19 World Cup 2023 : అండర్ 19 మహిళల ప్రపంచకప్ (U-19 Women's World Cup 2023) 2023లో టీమిండియా (Team India) కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్ లో భాగంగా జరిగే ఈ పోరులో శ్రీలంక మహిళల (Sri Lanka Women's Team) జట్టుతో భారత్ తలపడనుంది. శనివారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. దాంతో సెమీస్ చేరాలంటే భారత్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో ఓడిపోతే మాత్రం భారత్ సెమీస్ ఆశలు డేంజర్ లో పడతాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన షఫాలీ వర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.
అండర్ 19 టి20 ప్రపంచకప్ ను భారత్ వరుస విజయాలతో ఆరంభించింది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా లాంటి బలమైన జట్టును ఓడించింది. అదే దూకుడు కనబరుస్తూ సూపర్ సిక్స్ కు చేరుకుంది. అయితే సూపర్ సిక్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి సెమీస్ కు చేరే అవకాశాన్ని క్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ కేవలం 87 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బౌలింగ్ లోనూ పేలవ ప్రదర్శన కనబర్చి 7 వికెట్ల తేడాతో ఓడింది. ఇక శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఇందులో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదల మీద భారత్ ఉంది. ఇక సూపర్ సిక్స్ లో శ్రీలంక తొలి మ్యాచ్ ను ఆడతుంది. ఇందులో గెలిచి శుభారంభం చేయాలని ఉంది.
మ్యాచ్ ను ఎక్కడ చూడాలి?
ఈ మ్యాచ్ ను ఫ్యాన్ కోడ్ యాప్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ యాప్ ద్వారా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే అండర్ 19 సూపర్ సిక్స్ మ్యాచ్ ను చూడొచ్చు.
తుది జట్లు
శ్రీలంక అండర్ 19 మహిళల జట్టు
సెనెరత్నే, సిసంసల, గుణరత్నే, విహంగ, ననయక్కర, రత్నయకె, దిస్సనయకే, సెవండి, పెరీరా, సంజన, నేత్రాంజలి
టీమిండియా అండర్ 19 మహిళల జట్టు
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్, సౌమ్య తివారి, త్రిష, రిచా ఘోష్, బసు, సదు, కశ్యప్, అర్చన దేవి, చోప్రా, సోనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, South Africa, Sri Lanka, Team India