UNDER 19 HERO USA UNMUKT CHAND MAY LIKELY TO PLAY AGAINST TEAM INDIA IN T20 WORLD CUP 2024 SRD
Unmukt Chand : ఇదే విచిత్రం అంటే.. టీమిండియాకు ఆడాలకున్నాడు.. కానీ, ప్రత్యర్దిగా సవాల్ విసురుతున్నాడు..!
Unmukt Chand
Unmukt Chand : విరాట్ కోహ్లీలా ఆ యంగ్ క్రికెటర్ గా చెలరేగుతాడనుకున్నారు. క్రికెటర్‌గా ఎదగకముందే వచ్చిన క్రేజ్ అతని కొంపముంచింది. 8 ఏళ్ల పాటు భారత జట్టులో చోటు దక్కుతుందని ఎదురుచూశాడు. కానీ, చివరికి నిరాశే ఎదురైంది.
టీమిండియా (Team India) అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (Unmukt Chand).. సగటు క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే క్రికెటర్. 2012 అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన యువ సారథి. ఐపీఎల్(IPL)లో, ఫస్ట్ క్లాస్ క్రికెట్(First Class Cricket)లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఉన్ముక్త్ చంద్, క్రికెటర్‌గా ఎదగకముందే వచ్చిన క్రేజ్ కారణంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయాడు. 8 ఏళ్ల పాటు భారత జట్టులో అవకాశాల కోసం ఆశగా ఎదురుచూసిన ఉన్ముక్త్ చంద్.. అనూహ్యంగా 28 ఏళ్లకే భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న ఉన్ముక్త్.. ఇప్పుడు భారత జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశాన్ని సొంతం చేసుకోనున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ఆతిథ్య హక్కులను వెస్టిండిస్‌తో పాటు అమెరికా సైతం దక్కించుకుంది. దీంతో యూఎస్ఏ జాతీయ జట్టుతో కొనసాగుతున్న ఉన్ముక్త్‌కు ఈ అరుదైన అవకాశం దక్కనుంది.
2024 టీ20 ప్రపంచ కప్ టోర్నీని వెస్టిండిస్‌తో పాటు అమెరికాలోనూ నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ. క్రికెట్‌కు విశ్వవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో హోస్ట్ కంట్రీ హోదాలో యూఎస్ఏ తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించింది. దీంతో ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్న ఉన్ముక్త్.. టీమిండియాకు ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
టీమిండియా అండర్ 19 మాజీ సారథి ఉన్ముక్త్తో పాటు తమ సొంత జట్లపై ప్రత్యర్థి హోదాలో బరిలోకి దిగనున్నారు పలువురు క్రికెటర్లు. అందులో ప్రస్తుతం యూఎస్ఏ తరఫున క్రికెట్ ఆడుతున్న కోరే అండర్సన్(న్యూజిలాండ్), లియామ్ ప్లంకెట్(ఇంగ్లాండ్), జుయాన్ థెరాన్(దక్షిణాఫ్రికా), సమీ అస్లాం(పాకిస్థాన్)లు ఉన్నారు.
యూఎస్ఏకి మకాం మార్చిన ఉన్ముక్త్ చంద్, మైనర్ లీగ్ క్రికెట్లో పాల్గొన్న ఉన్ముక్త్ చంద్, 2021 సీజన్లో 612 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బిగ్ బాష్ లీగ్ 2022లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా నిలిచిన ఉన్ముక్త్ చంద్, మెల్బోర్న్ రెనెగాడ్స్ జట్టు తరుపున కొన్ని మ్యాచులు ఆడాడు.టీ20 వరల్డ్ కప్ 2024కి యూఎస్ఏ ఆతిథ్యం ఇవ్వబోతుండడంతో హోస్ట్ కంట్రీగా ఆటోమేటిక్‌గా ఆ టోర్నీకి అర్హత సాధించింది అమెరికా... ఈ నిర్ణయంతో యూఎస్ఏ తరుపున ఆడుతున్న ఉన్ముక్త్ చంద్, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో పాల్గొనబోతున్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.