న్యూస్18తెలుగు ప్రతినిధిః పి మహేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన మూలిగే బాలయ్య రాధా దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.. వీరిది వ్యవసాయ కుటుంబం.. వికాస్ 1998 నవంబర్ 19 జన్మించారు.. వికాస్ చిన్నప్పట్నుంచి క్రికెటర్ కావాలని కోరికతో పెరిగాడు.. ఉన్న ఊరిలో పదవ తరగతి వరకు చదువు కున్నారు.. జిల్లా కేంద్రలో ఇంటర్, ఐటిఐ ఎలక్రిషన్ పూర్తి చేసారు.. 2016 నుంచి జిల్లాస్థాయి క్రికేటర్ గా ఎదిగాడు.. ఎలాంటి కొచ్ లేకుండా తను స్వయంగా క్రికేట్ లో ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. జిల్లా స్థాయి పోటిలో ప్రతిభ కనబర్చడంతో 2017లో అండర్ 19 కి ఎంపికయ్యారు.. అనంతరం 2018లో అండర్ 19 జాతీయ జట్టుతో శ్రీలంక టూర్ కు ఎంపికయ్యాడు.. శ్రీలంక టూర్ లో మూడు టి20 మ్యాచ్‌లు అడారు.. మొదటి టి-20లో ఓటమి భారత్ ఓటమి పాలయింది.. రెండు, మూడు టి20లో ఘన విజయం సాధించి కప్ ను కైవసం చేసుకుంది.. అయితే వికాస్ ఈ రెండు టీ20ల్లో తన ప్రతిభతో జట్టును గెలిపించాడు..
దీంతో వికాస్ కు ఈ రెండు టీ20 మ్యాచ్చుల్లో మ్యాన్ ఆఫ్ దీ మ్యచ్ గా ఎంపికయ్యారు.. భారత్ విజయకేతనం ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించారు.. ఇంతటి ప్రతిభాశాలికి మరో అవకాశం దొరకలేదు.. కొచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేక పోవడంతో తన ప్రతిభను పక్కనబెట్టి ప్రస్తుతం వ్యవసాయంలో తండ్రికి ఆసరాగా మారాడు.. వారికి ఉన్న ముడేకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి కూలీగా వెళుతున్నాడు..అయితే.. ప్రతిభ ఉన్న ఇలాంటి క్రికెటర్ క్రికెట్ కు దూరమవ్వడం భాతర దేశానికి ఒక మంచి క్రికెటర్ ను మిస్ అయినట్టేనని పలువురు భావిస్తున్నారు..
ఎంతో శ్రమించి తాను ఎంచుకున్న క్రీడలో మెలకువలు నేకున్న ప్రయోజనం లేకుండా పోయింది.. ఇలాంటి క్రికేటర్ కు తెలంగాణ క్రికేట్ బోర్డు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో వారి సేవలను వాడుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తన పరిస్థితిపై వికాష్ మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి కష్టపడి క్రికేటర్ గా ఎదిగానని అన్నారు.. తాను పడిన కష్టానికి చాలా మ్యాచ్‌లో ఆడినా..ఆ తర్వాత 2020లో సౌత్ జోన్ సీనియర్ గా అవకాశం దక్కిందని...అయితే ఇక అప్పటి నుండి ఎలాంటి సమాచరం లేదు.. కొంచిగ్ తీసుకునే అర్థిక స్థొమత లేక పోవడంతో ఇంటికి వచ్చేసాను.. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అడాలనేది నా కోరిక... కానీ అ కోరిక కోరికగానే మిగిలి పోయింది.. అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.