Cricket : ద్యేవుడా ఇదేమీ బ్యాటింగ్ సామీ..నాలుగు బంతుల్లో ఆట ముగిసింది..ఇదో రికార్డు..

ద్యేవుడా ఇదేమీ బ్యాటింగ్ సామీ..నాలుగు బంతుల్లో ఆట ముగిసింది..ఇదో రికార్డు..

Cricket : దేశవాళీ మహిళా వన్డే క్రికెట్ లో ఓ చెత్త రికార్డు క్రియేట్ అయింది. ముంబై-నాగాలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. కేవలం నాలుగు బంతుల్లోనే ఆట ముగిసింది.

  • Share this:
    క్రికెట్ లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్క రోజు పరుగుల వరద పారితే..మరో రోజు బ్యాటింగ్ చేయడానికే తిప్పలు పడతారు. ఏ మ్యాచ్‌లో ఏ రికార్డ్ నమోదు అవుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఘటనే భారత దేశవాళీ క్రికెట్ లో జరిగింది. దేశవాళీ క్రికెట్ లో ఓ వన్డే మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడచూసినా.. ఈ మ్యాచ్ గురించే వార్తలు కనబడుతున్నాయి. ఉమెన్స్ సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా నాగాలాండ్, ముంబై జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ నిమిషాల్లోనే పూర్తయింది. నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్‌ చేయడమే కాకుండా.. కేవలం 4 బంతుల్లోనే ఛేదనను ముగించేసింది ముంబై. ఈ‌ మ్యాచుకు ఆతిథ్యమిచ్చిన ఇండోర్‌ ఇందుకు వేదికైంది. పేసర్ సయాలి సత్ఘరె మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. హోల్కర్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నాగాలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదే వారి కొంప ముంచింది. ముంబై కెప్టెన్, మీడియం పేసర్‌ సయాలీ సత్ఘరె.. నాగాలాండ్ జట్టును బెంబేలెత్తించింది. 8.4 ఓవర్లలో కేవలం 5 పరుగులిచ్చి 7 వికెట్లు తీసింది. సయాలీ ధాటికి ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరుని నమోదు చేయలేకపోయారు. ఓపెనర్లు జ్యోతి (0), కికయంగ్ల (0)తో పాటు కెప్టెన్ సెంటిలీమ్ల (0), ఎలీనా (0) వరుసగా డకౌట్ అయ్యారు.

    సయాలీతో పాటు ఎస్‌. థాకోర్‌ (1/0), దాక్షిణి (2/12) ఆధిపత్యం చెలాయించడంతో సరీబా (9) మాత్రమే కాసేపు క్రీజులో నిలిచి పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన సరీబా టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. చివరకు నాగాలాండ్ 17.4 ఓవర్లలో 17 పరుగులకి ఆలౌట్ అయింది. నాగాలాండ్ ఆడిన ఓవర్లలో 4 మెయిడిన్లు ఉండటం మరో విశేషం.


    ఇక 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు కేవలం 4 బంతుల్లోనే పని పూర్తి కానిచ్చేసింది. ముంబై ఓపెనర్లు ఇషా ఓజా, వృషాలి భగత్‌లు తొలి ఓవర్‌ నాలుగు బంతుల్లోనే నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించారు. ఆడిన నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టి ఔరా అనిపించారు. మొత్తంగా 17.04 ఓవర్లు ఆడిన నాగాలాండ్ 17 పరుగులు చేయగా.. కేవలం నాలుగు బంతులు ఆడిన ముంబై 20 పరుగులు చేసి పది వికెట్ల తేడాతో ఘనం విజయం సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
    Published by:Sridhar Reddy
    First published: