• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • UMPIRE PAUL REIFFEL TAKEN BACK HIS DECISION ANOTHER UMPIRE STICK TI HIS DECISION JNK

IPL 2021 : అంపైర్ పాల్ రీఫిల్ డెషిషన్ మార్చుకున్నాడు.. కానీ మరో అంపైర్ మాత్రం మార్చుకోలేదు..!

నిర్ణయాన్ని మార్చుకున్న అంపైర్ పాల్ రీఫిల్ [PC: iplt20.com]

  • Share this:
    అంపైర్ పాల్ రీఫిల్ (Umpire) (Paurl Reiffel) తన డెషిషన్ మార్చుకున్నాడు. ''అవును దాంట్లో వింతేమున్నది.. అంపైర్లు ఇచ్చే డెషిషన్‌తో ఏకీభావం లేకపోతే డీఆర్ఎస్‌కు వెళ్లొచ్చు. అక్కడ టీవీ అంపైర్ చెప్పేదాన్ని బట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయం మార్చుకుంటాడు'' అని అంటున్నారా. అయితే మేం చెప్పేది.. అంపైర్ పాల్ రీఫిల్ డెషిషన్ మార్చుకున్నది మ్యాచ్ సమయంలో తీసుకున్న నిర్ణయం కాదు. తాను ఐపీఎల్‌లో కొనసాగాలనే నిర్ణయం. ఇటీవల దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఐపీఎల్ (IPL2021) నుంచి పలువురు క్రికెటర్లు, అంపైర్లు, రిఫరీలు వైదొలగి ఇంటికి వెళ్లిపోయారు. రాజస్థాన్ రాయల్‌కు చెందిన ఆండ్రూ టై, లియామ్ లివింగ్‌స్టన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన రవిచంద్రన్ అశ్విన్ బయోబబుల్ వదిలి ఇంటికి వెళ్లిపోయారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించడంతో అంపైర్ పాల్ రీఫిల్ కూడా ఐపీఎల్ వదిలి స్వదేశానికి వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నారు. మరో అంపైర్ నితిన్ మీనన్ భార్యకు కరోనా సోకడంతో ఆయన కూడా ఐపీఎల్ నుంచి వైదొలుగుతానని బీసీసీఐకి సమాచారం అందించారు. ఇద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లు, ఒక రిఫరీ ఐపీఎల్ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

    రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఐపీఎల్ నుంచి వైదొలిగిన రెండో భారతీయుడు నితిన్ మీనన్. ఐపీఎల్ ఎలైట్ ప్యానల్ అంపైర్లలో ఉన్న ఓకే ఒక్క ఇండియన్ కూడా అతడే. అతి చిన్న వయసులోనే ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో స్థానం సంపాదించాడు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో రెగ్యులర్ అంపైర్‌గా ఉంటున్నాడు. ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచే ఆయన బయోబబుల్‌లో ఉంటున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ బబుల్‌లోకి మారారు. అయితే నితిన్ మీనన్ భార్యకు కరోనా సోకడంతో ఆయన ఐపీఎల్‌ను వీడారు. ఈ సీజన్ మొత్తానికి అతడి అంపైరింగ్ సేవలు ఇక అందుబాటులో ఉండవు.

    నితిన్ మీనన్‌తో పాటు బయోబబుల్ వదిలి వెళ్లాలనుకున్న పాల్ రీఫిల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెళ్లే వీలు లేకపోవడంతో పాటు ఇండియా నుంచి వచ్చే వాళ్లకు జైలు శిక్ష విధిస్తామని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేసే వరకు పాల్ రీఫిల్ స్వదేశానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో కొనసాగాలని రీఫిల్ నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
    Published by:John Naveen Kora
    First published: