Home /News /sports /

UMPIRE HARSH PENALTY TO CARLOS BRAITHWAITE FOR THROWING BALL TO BATTER SJN

Carlos Braithwaite : విండీస్ ప్లేయర్లంటే అంత చులకనా మీకూ.. చేయని తప్పుకు ఇంత పెద్ద శిక్షా?

PC : TWITTER

PC : TWITTER

Carlos Braithwaite : క్రికెట్లో అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి. వీటి వల్ల ప్లేయర్లకు అప్పుడుప్పుడు గాయాలు కూడా అవుతుంటాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి క్రికెట్ లో చోటు చేసుకుంది.

Carlos Braithwaite : క్రికెట్లో అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి. వీటి వల్ల ప్లేయర్లకు అప్పుడుప్పుడు గాయాలు కూడా అవుతుంటాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి క్రికెట్ లో చోటు చేసుకుంది. వెస్టిండీస్ (West Indies) ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ (Carlos Braithwaite) కావాలని చేయకపోయినా.. అతడి టీంకు శిక్షను విధించారు అంపైర్లు. ఇదంతా కూడా ఇంగ్లండ్ (England) వేదికగా జరుగుతోన్న టి20 బ్లాస్ట్ లీగ్ లో చోటు చేసుకుంది. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్‌షైర్‌, డెర్బీషైర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో బ్రాత్ వైట్ ఉద్దేశపూర్వకంగా డెర్బీషైర్ ప్లేయర్ ను బాల్ తో కొట్టినట్లు తేల్చిన అంపైర్లు డెర్బీషైర్ కు ఐదు పరుగులను జోడించారు.

ఇది కూడా చదవండి : పంత్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. ఒక్కసారి ఆ స్థానంలో ఆడించి చూడండి

డెర్బీషైర్‌ బ్యాటింగ్ చేస్తుండగా.. 13వ ఓవర్ వేయడానికి బ్రాత్ వైట్ వచ్చాడు. స్ట్రయికింగ్ ఎండ్ లో 34 పరుగులతో వేన్‌ మాడ్సన్‌ ఉన్నాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని బ్రాత్‌వైట్‌ యార్కర్‌ వేయగా.. మాడ్సన్‌ బంతిని ముందుకు పుష్‌ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్‌.. గిర్రున తిరుగుతూ వేన్ క్రీజు వదిలి ముందుకు వచ్చాడనే ఉద్దేశంతో వికెట్లకు త్రో వేశాడు. అయితే బంతి బ్యాటర్ పాదానికి తగిలింది. వెంటనే బ్రాత్‌వైట్‌ మాడ్సన్‌ను క్షమాపణ కోరాడు. నాన్‌స్ట్రైకర్‌ కాల్‌ ఇవ్వడంతో సింగిల్‌ పూర్తి చేశారు. బ్రాత్ వైట్ సారీ చెప్పడంతో దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు.



అయితే ఇదంతా గమనించిన అంపైర్.. లెగ్ అంపైర్ దగ్గరకు వెళ్లి ఈ విషయంపై చర్చించాడు. అనంతరం బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు.ఆ తర్వాత బంతిని డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఉద్ధేశపూర్వకంగా చేయకపోయినా బ్రాత్‌వైట్‌ జట్టు అనవసరంగా మూల్యం చెల్లించుకుంది. ఆ ఓవర్‌లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే డెర్బీషైర్‌ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వార్విక్‌ షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన డెర్బీషైర్‌ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.



అయితే ఇక్కడే అందరూ ఒక విషయాన్ని గమనించాలి. 2014-15లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ సిరీస్ లో విరాట్ కోహ్లీ, మిచెల్ జాన్సన్ ల మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఒక మ్యాచ్ లో అయితే జాన్సన్ విరాట్ కోహ్లీపైకి త్రో విసరతాడు. అక్కడ త్రో అవసరం లేకపోయినా బంతిని త్రో చేస్తాడు. ఆ బంతి కాస్తా విరాట్ కోహ్లీ వీపును బలంగా తాకుతుంది. ఆ సమయంలో అంపైర్లు టీమిండియాకు ఒక్క పరుగును కూడా పెనాల్లీ రూపంలో యాడ్ చేయరు. అక్కడ జాన్సన్ చేసింది తప్పు అయినప్పటికీ పెనాల్టీ ఇవ్వరు.. ఇక తాజాగా బ్రాత్ వైట్ విషయంలో మాత్రం మరోలా జరిగింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, England, Hardik Pandya, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు