• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • UMPIRE ALEEM DAR FEEL GOOD AS KARACHI KINGS LOSE REVIEW FOR CHALLENGING HIS DECISION SA

నన్ను కాదని‌ రివ్యూకు వెళ్తారా.. ఇప్పుడు ఏమైందో చూశారుగా! (Video)

నన్ను కాదని‌ రివ్యూకు వెళ్తారా.. ఇప్పుడు ఏమైందో చూశారుగా! (Video)

Umpire Aleem Dar

క్రికెట్‌లో ప్రవేశపెడుతున్న కొత్త నిబంధనలు ఆటలో మరింతగా ఖచ్చితత్వాన్ని పెంచుతున్నాయి. ఏమాత్రం పోరపాటుకు అస్కారం లేకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన డీఆర్‌ఎస్‌ రూల్స్‌ ఆటగాళ్ళకు వరంగా మారుతున్నాయి

  • Share this:
    క్రికెట్‌లో ప్రవేశపెడుతున్న కొత్త నిబంధనలు ఆటలో మరింతగా ఖచ్చితత్వాన్ని పెంచుతున్నాయి. ఏమాత్రం పోరపాటుకు అస్కారం లేకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన డీఆర్‌ఎస్‌ రూల్స్‌ ఆటగాళ్ళకు వరంగా మారుతున్నాయి. అయితే ఈ రూల్స్ ఫీల్డ్‌ అంపైర్లకు కొంత శరాఘాతంగా మారాయి. వారిచ్చిన నిర్ణయం నచ్చకపోతే ఆటగాళ్ళు రివ్యూ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ వచ్చే నిర్ణయాలు ఆటగాళ్ళతో పాటు.. అంఫైర్లను కూడా ఉత్కంఠకు గురిచేస్తాయి. అనుకూలంగా వస్తే సరి లేదంటూ మాత్రం ఎంఫైర్స్ అవమానకరంగా భావించాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం సరైంది అయితే మాత్రం ఎంఫైర్ల ముఖాలలో గర్వం ఉంటుంది.

    ఆటలో ఆటగాళ్ళు రివ్యూలకు వెళ్ళడం కామన్.. నిర్ణయం అనుకూలంగా వస్తే హ్యాపీ లేదంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకుని మాములుగా మళ్ళీ ఆటను కొనసాగించడం. అయితే ఆటగాళ్ళ కంటే రివ్య్యూపై ఆంఫైర్లకే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. అనుకూలంగా వస్తే వారిలో తెలియని సంతోషం. తాజాగా సీనియర్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ తనకు అనుకూలంగా నిర్ణయం రావడంతో ఎమోషన్‌ను దాచుకోలేకపోయారు.







    పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌, కరాచీ కింగ్స్‌ మద్య బుధవారం లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌ 19వ ఓవర్లో ఒక్క పరుగు చేస్తే విజయం సాధిస్తుంది. కరాచీ మక్సూద్‌ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని ఇస్లామాబాద్‌ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్‌ అలీ థర్డ్‌ మన్‌ దిశగా బాది పరుగు పూర్తి చేశాడు. అయితే బంతి ప్యాడ్‌కు తాకి వెళ్లిందోమోనన్న అనుమానంతో మక్సూద్‌ అలీ ఎల్బీకి అప్పీల్‌ చేశాడు. దాన్ని ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ నాటౌట్‌గా ఇచ్చారు. దీంతో కరాచీ కింగ్స్‌ టీం డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. ఆ బంతిని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఇస్లామాబాద్‌ విజయం సాదించింది.

    అయితే ఇక్కడ కొస మెరుపు ఏంటంటే.. తాను చెప్పిన కూడా వినకుండా కరాచీ కింగ్స్‌ రివ్యూకు వెళ్ళడం.. ఆ నిర్ణయం వారికి వ్యతిరేకంగా రావడంతో ఎంఫైర్ అలీమ్‌ దార్‌ ఆనందంతో.. నేనే గెలిచా.. అన్నట్లు సైగలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనల్‌గా ఇస్లామాబాద్‌ యునైటెడ్స్‌ కరాచీ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఇస్లామాబాద్ గెలిచింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు