పాకిస్థాన్ క్రికెట్‌‌కు చావుదెబ్బ...తీరు మారలేదు...ఏం జరిగిందంటే...

ఉమర్ అక్మల్

ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం విధించారు.

  • Share this:
    పాకిస్థాన్ బ్యాట్స్​మన్​ ఉమర్ అక్మల్​ 3ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్​ నుంచి బ్యాన్ విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్ సందర్భంగా కొందరు బుకీలు అక్మల్ తో సంప్రదింపులు జరిగినా తమకు ఫిర్యాదు చేయకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు(పీసీబీ) చర్యలకు దిగింది. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం విధించారు. ఫిక్సింగ్‌కు సంబంధించి బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టిన ఉమర్ అక్మల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నిర్ణయించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపింది. విచారణలో ఉమర్ అక్మల్ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన విషయం తేలడంతో అతనిపై మూడేళ్లు నిషేధం విధిస్తూ పిసిబి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా కొందరూ బుకీలు అక్మల్‌ను సంప్రదించారు. కానీ, ఈ విషయాన్ని ఉమర్ అక్మల్ బోర్డుకు తెలపకుండా దాచి పెట్టాడు. దీనిపై విచారణ జరిపిన పిసిబి ఉమర్‌పై మూడేళ్ల నిషేధం విధించింది.
    Published by:Krishna Adithya
    First published: