ఫిఫా వరల్డ్ కప్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన మరో మెగా టోర్నీ యూరో కప్ (Euro Cup 2021). ఐరోపా దేశాల మధ్య జరిగే ఈ ఫుట్ బాల్ చాంపియన్‌షిప్ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) (UEFA) ఆధ్వర్యంలో జరిగే ఈ చాంపియన్‌షిప్‌కు కేవలం ఐరోపాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం గత ఏడాది 12 జూన్ నుంచి 12 జులై వరకు ఈ టోర్నీ నిర్వహించాల్సి ఉన్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2021 జూన్ 11 నుంచి జులై 11 వరకు ఈ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ 2016లో చాంపియన్‌షిప్ గెల్చుకున్నది. క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఫైనల్ డ్రాకు 24 జట్లు అర్హత సాధించాయి. ఈ 24 జట్లను 6 గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గ్రూప్ మ్యాచ్‌లు జూన్ 11 నుంచి 23 వరకు జరుగనున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లు జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. రౌండాఫ్ 16 మ్యాచ్‌లు జూన్ 26 నుంచి 29 వరకు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జులై 2, 3న సెమీఫైనల్ మ్యాచ్‌లు జులై 6, 7న నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ జులై 11న జరుగనున్నది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు లండన్‌లోని వింబ్లే స్టేడియంలో జరుగున్నాయి.
ఏ గ్రూప్‌లో ఎవరు?
గ్రూప్ ఏ : టర్కీ, ఇటలీ, వేల్స్, స్విట్జర్లాండ్
గ్రూప్ బి : డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, రష్యా
గ్రూప్ సి : నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ఆస్ట్రియా, నార్త్ మాసిడోనియా
గ్రూప్ డి : ఇంగ్లాండ్, క్రొయేషియా, స్కాట్లాండ్, చెక్ రిపబ్లిక్
గ్రూప్ ఈ : స్పెయిన్, స్వీడన్, పోలాండ్, స్లోవేకియా
గ్రూప్ ఎఫ్ : హంగేరి, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మని
గ్రూప్ మ్యాచ్‌లు
జూన్ 11 : టర్కీ Vs ఇటలీ
జూన్ 12 : వేల్స్ Vs స్విట్జర్లాండ్, డెన్మార్క్ Vs ఫిన్లాండ్, బెల్జియం Vs రష్యా
జూన్ 13 : ఆస్ట్రియా Vs నార్త్ మాసిడోనియా, నెదర్లాండ్స్ Vs ఉక్రెయిన్, ఇంగ్లాండ్ Vs క్రొయేషియా
జూన్ 14 : స్కాట్లాండ్ Vs చెక్ రిపబ్లిక్, పోలాండ్ Vs స్లోవేకియా, స్పెయిన్ Vs స్వీడన్
జూన్ 15 : హంగేరి Vs పోర్చుగల్, ఫ్రాన్స్ Vs జర్మని
జూన్ 16 : టర్కీ Vs వేల్స్, ఇటలీ Vs స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ Vs రష్యా
జూన్ 17 : డెన్మార్క్ Vs బెల్జియం, ఉక్రెయిన్ Vs నార్త్ మాసిడోనియా, నెదర్లాండ్స్ Vs ఆస్ట్రియా
జూన్ 18 : క్రొయేషియా Vs చెక్ రిపబ్లిక్, ఇంగ్లాండ్ Vs స్కాట్లాండ్, స్వీడన్ Vs స్లోవేకియా
జూన్ 19 : స్పెయిన్ Vs పోలాండ్, హంగేరి Vs ఫ్రాన్స్, పోర్చుగల్ Vs జర్మనీ
జూన్ 20 : స్విట్జర్లాండ్ Vs టర్కీ, ఇటలీ Vs వేల్స్,
జూన్ 21 : రష్యా Vs డెన్మార్క్, ఫిన్లాండ్ Vs బెల్జియం, నార్త్ మాసిడోనియా Vs నెదర్లాండ్స్, ఉక్రెయిన్ Vs ఆస్ట్రియా
జూన్ 22 : క్రొయేషియా Vs స్కాట్లాండ్, చెక్ రిపబ్లిక్ Vs ఇంగ్లాండ్,
జూన్ 23 : స్లోవేకియా Vs స్పెయిన్, స్వీడన్ Vs పోలాండ్, పోర్చుగల్ Vs ఫ్రాన్స్, జర్మనీ Vs హంగేరి
యూరో కప్ 2021 షెడ్యూల్
అన్ని గ్రూపులలో టాప్ 2 జట్లతో పాటు, ఏ, బీ, సీ, డీ గ్రూపుల్లోని మూడో స్థానంలో నిలిచిన జట్లు నాకౌట్ స్టేజీకి అర్హత సాధిస్తాయి. మొత్తం 16 జట్లు నాకౌట్లో తలపడతాయి.
యూరో కప్‌లో ఆడే ప్రతీ జట్టులో కీలకమైన ఆటగాళ్లు ఉంటారు. జట్టులో వాళ్లు కనుక రాణిస్తే గెలుపు సులభమే అని అనుకోవచ్చు. అలా ఏ జట్టులో ఎవరు కీ ప్లేయర్స్.. ఆ జట్టు కోచ్.. గత రికార్డును పరిశీలిస్తే
టర్కీ: డొన్నారుమ్మా (గోల్ కీపర్). కోచ్ - రాబెర్టో మన్సినీ. టర్కీ జట్టు యూరో - 2016లో క్వార్టర్స్ ఫైనల్స్ వరకు వచ్చింది. ఫిఫా ర్యాంకింగ్ 7. 1968లో చాంపియన్‌గా నిలిచారు.
వేల్స్ : గరెత్ బాలే (ఫార్వర్డ్ ఆటగాడు). కోచ్ - రాబర్ట్ పేజ్, వేల్స్ జట్టు యూరో 2016లో సెమీఫైనల్ చేరుకున్నది. ఫిఫా ర్యాంకింగ్ 17.
స్విట్జర్లాండ్ : గ్రానిత్ జాకా (మిడ్ ఫీల్డర్) , కోచ్ - వ్లాదిమీర్ ప్లెట్కోవిక్, స్విస్ జట్టు యూరో 2016లో నాకౌట్ వరకు చేరుకున్నారు. ఫిఫా ర్యాంకింగ్ 13.
డెన్మార్క్ : క్రిస్టియన్ ఎరిక్సన్ (ఎటాకింగ్ మిడ్‌ఫీల్డర్), కోచ్ - కాస్పర్ జుల్మాండ్, 2016 యూరో కప్‌కు క్వాలిఫై కాలేదు. ఫిఫా ర్యాంకింగ్ 10. 1992లో యూరో చాంపియన్స్.
బెల్జియం : కెవిడ్ డి బ్రూనే (మిడ్ ఫీల్డర్ ), కోచ్ - రాబెర్టో మార్టినెజ్, యూరో 2016లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. 1980లో యూరో కప్ ఫైనల్ చేరుకున్నారు. ఫిఫా ర్యాంకింగ్ 1
రష్యా : అలెగ్జాండర్ గొలోవిన్ (మిడ్ ఫీల్డర్), కోచ్ - స్టానిస్తావ్ చెర్కోసోవ్. 2016 యూరో కప్‌లో గ్రూప్ స్టేజీలోని ఆగిపోయింది. 1960లో యూఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు చాంపియన్. ఫిఫా ర్యాంకింగ్ 38
నెదర్లాండ్స్ : మెంఫిస్ డీపే (ఫార్వర్డ్), కోచ్ - ఫ్రాంక్ డి బోయర్, యూరో 2016కి క్వాలిఫై అవలేదు. 1988లో యూరో చాంపియన్. ఫిఫా ర్యాంకింగ్ 16
ఉక్రెయిన్ : ఒలెక్సాందర్ జించెంకో ( సెంట్రల్ మిడ్ ఫీల్డర్), కోచ్ - ఆండ్రీ షెవ్చెంకో. యూరో 2016లో గ్రూప్ స్టేజికే పరిమితం. ఫిఫా ర్యాంకింగ్ 24
ఆస్ట్రియా : డేవిడ్ అలాబా (డిఫెండర్) కోచ్ - ఫ్రాంకో ఫోడా. 2016 యూరో కప్‌లో గ్రూప్ స్టేజ్. ఫిఫా ర్యాంకింగ్ 23
నార్త్ మాసిడోనియా : గోరన్ పాండేవ్ (స్ట్రైకర్) కోచ్ - ఇగొర్ ఆంజిలోవిస్కీ, యూరో కప్‌కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి. ఫిఫా ర్యాంకింగ్ 62
ఇంగ్లాండ్ : హారీ కేన్ (స్ట్రైకర్), కోచ్ - గరెత్ సౌత్ గేత్, యూరో 2016లో నాకౌట్ స్టేజీకి చేరుకున్నది. 1968లో మూడో స్థానంతో సరిపెట్టుకున్నది. ఫిఫా ర్యాంకింగ్ 4
క్రొయేషియా : లూకా మోడ్రిక్ (మిడ్ ఫీల్డర్), కోచ్ - జాట్కో డలిక్, యూరో 2016 నాకౌట్ దశకు చేరుకున్నది. 1996, 2008లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చింది. ఫిఫా ర్యాంకింగ్ 14
స్కాట్లాండ్ : ఆండీ రాబర్ట్సన్ (డిఫెండర్), కోచ్ - స్టీవ్ క్లార్క్, యూరో 2016కి క్వాలిఫై కాలేదు. ఫిఫా ర్యాంకింగ్ 44
చెక్ రిపబ్లిక్ : థామస్ సౌసెక్ (డిఫెన్సీవ్ మిడ్‌ఫీల్డర్), కోచ్ - జరోస్లేవ్ సిల్హవీ, యూరో 2016లో గ్రూప్ స్టేజి వరకు వచ్చింది. 1976లో చెకోస్లోవేకియాగా కలసి ఉన్నప్పుడు విజేతగా నిలిచింది. ఫిఫా ర్యాంకింగ్ 40
ఫ్రాన్స్ : కైలియన్ మాప్పే (ఫార్వర్డ్), కోచ్ - డీడియర్ డెస్చాంప్స్, యూరో 2016 రన్నరప్. 1984, 2000 యూరో కప్ చాంపియన్. ఫిఫా ర్యాంకింగ్ 2
జర్మని : థామస్ ముల్లర్ (ఫార్వర్డ్), కోచ్ - జకోచిమ్ లో, యూరో 2016 సెమీస్. 1972, 1980, 1996లో యూరో చాంపియన్స్. ఫిఫా ర్యాంకింగ్ 12
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.