క్రీడలు

  • associate partner

IPL 2020: ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన రాలేదు: ఈసీబీ

ఐపీఎల్ 2020 దుబాయ్‌లో జరుగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా బాంబు పేల్చింది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). ఆతిథ్యంపై తమకు బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఈసీబీ బుధవారం తెలిపింది.

Rekulapally Saichand
Updated: July 23, 2020, 2:49 PM IST
IPL 2020: ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన రాలేదు: ఈసీబీ
ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనే అభిమానులు సందేహానికి తెరపడింది. ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై సృష్టత లేకపోయినప్పటీకి ఈవెంట్ వేదికపై మాత్రం స్పష్టత లభించింది. అక్టోబర్‌-నవంబర్‌లో దుబాయ్‌ వేదికగా లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
  • Share this:


అసియా కప్,టీ20 వరల్డ్ కఫ్ వాయిదా పడడంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ఏప్రెల్‌లో జరగాల్సిన ఐపీఎల్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఏలాగైనా ఐపీఎల్ నిర్వహించాలని గట్టి పట్టుదలతో ఉన్న బీసీసీఐకి రెండు బిగ్ ఈవెంట్స్ వాయిదా పడడం కలిసోచ్చింది. అక్టోబర్ - నవంబర్ నెలలో టోర్నీ నిర్వహించాలని భారత్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది. టోర్నీని యుఏఈలో నిర్వహించాలని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఐపీఎల్ 2020 దుబాయ్‌లో జరుగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా బాంబు పేల్చింది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). ఆతిథ్యంపై తమకు బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఈసీబీ బుధవారం తెలిపింది. అయితే బీసీసీఐ.. దుబాయ్‌లో ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటే తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. తాజాగా మైఖేల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసీబీ అధికారి ఒక్కరు మాట్లాడుతూ "ఐపీఎల్ 2020 యూఏఈలో నిర్వహిస్తురనే వార్తలు వస్తున్నాయి. అయితే మాకు ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక స్రకటన అందలేదు. త్వరలో ఐపీఎల్ పాలక మండలి భేటి ఉంది. అప్పటివరకు మేము వేచిఉంటాం" అన్నారు"
Published by: Rekulapally Saichand
First published: July 23, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading