Home /News /sports /

U20 WORLD ATHLETICS 2022 VIRAL VIDEO WARDROBE MALFUNCTION MAKES ITALIAN ATHLETE ATHLETE LOSE RACE HERES WHAT HAPPENED SJN

U20 World Athletics: రన్నర్ కొంప ముంచిన అండర్ వేర్..రన్నింగ్ మధ్యలో ట్విస్ట్ మామూలుగా లేదుగా.. ఏం జరిగిందంటే?

PC : RCN Mundo/Twitter

PC : RCN Mundo/Twitter

U20 World Athletic ChampionShips : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతూనే ఉంది. ఒకవైపు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతుండగా.. మరోవైపు అండర్ 20 విభాగంలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ (U20 World Athletic ChampionShips) పోటీలు జరుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
U20 World Athletic ChampionShips : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతూనే ఉంది. ఒకవైపు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతుండగా.. మరోవైపు అండర్ 20 విభాగంలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ (U20 World Athletic ChampionShips) పోటీలు జరుగుతున్నాయి. వీటికి కొలంబియా (colombia) దేశం వేదికైంది. అయితే పురుషుల 400 మీటర్ల పరుగులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటలీకి చెందిన ఈ 18 ఏళ్ల అథ్లెట్ అల్బెర్టో నోనినో (Alberto Nonino) ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..

ఇది కూడా చదవండి : సండే ధమాకా.. తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ పసిడి పోరు నేడే.. లైవ్ మ్యాచ్ ఎప్పుడంటే?

పరుషుల 400 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఇటలీకి చెందిన ఈ 18 ఏళ్ల అల్బెర్టో నోనినో సిద్ధం అయ్యాడు. అతడితో పాటు మరో ఏడుగురు రన్నర్ లు కూడా సిద్ధంగా ఉన్నారు. రిఫరీ గన్ పేల్చగా.. అందరూ పరుగును మొదలు పెట్టారు. కొన్ని మీటర్ల దూరం పరుగెత్తగానే అల్బెర్టో తన షార్ట్స్ ను సరిచేసుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. పరుగెత్తుతూనే తన షాట్స్ ను సరిచేసుకుంటూ పరుగులో వెనకబడి పోయాడు. చివరకు రేసును చివరి స్థానంతో ముగించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అల్బెర్టో రన్నింగ్ మధ్యలో ఏం జరిగిందో వెల్లడించాడు.


అతడు అండర్ వేర్ వేసుకోకుండానే కేవలం షార్ట్స్ తోనే రేసులో పాల్గొన్నాడు. పరుగు ఆరంభమైన కాసేపటికి అతడి పురుషాంగం షార్ట్స్ నుంచి బయటకు వచ్చింది. దాంతో అతడు షార్ట్స్ సరిచేసుకునే పనిలో పడి పరుగులో వెనకబడి పోయాడు. రేసు పూర్తయ్యాక తనపై తనకే అసహ్యం వేసిందని అల్బెర్టో తెలిపాడు. తాను చేసిన చిన్న పొరపాటు వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. అంతేకాకుండా తనకు మద్దతుగా నిలిచిన వారికి క్షమాపణలు తెలియజేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India Vs Westindies, Sports, Viral, Viral vide, Viral Video, Viral Videos

తదుపరి వార్తలు