క్రీడా వినోదం అందించడంతోపాటు దేశవాళి క్రికెట్ లో యంగ్ టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించడం ఇండియన్ ప్రీమియర లీగ్(ఐపీఎల్) ప్రధాన ఉద్దేశం. మరి ఈ ఏడాది ఐపీఎల్ ఆ దిశగా ఏమరకు ఫలించిందని చూస్తే.. ఇటీవలె ముగిసిన అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్లు మంచి ధర పలికారు. విక్కీ ఒస్త్వాల్పై మంచి అంచనాలు ఉన్నప్పటికీ అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. అయితే కొందరు మాత్రం చెప్పుకోదగ్గ మొత్తాన్నే సొంతం చేసుకున్నారు. వారిలో ఎవరున్నారంటే...
రాజ్ అంగద్ బవ (Raj Angad bawa): స్వతహాగా స్పోర్ట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రాజ్ బవ మెగా వేలంలో అదరగొట్టాడు. ఇతడిని రూ. 2 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అండర్-19 ప్రపంచకప్‌లో ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో 108 బంతుల్లో 162 పరుగులు చేసి అందరినీ తనవైపు చూసేలా చేశాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా శిఖర్ ధావన్ (155 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును తన సునామీ ఇన్నింగ్స్‌తో చెరిపేశాడు. ఆ మ్యాచ్‌లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టాడు. ఇతడు మీడియం పేసర్ కావడం విశేషం. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్రను చక్కగా పోషించాడు. ఇతడి తండ్రి భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కోచ్ కావడం విశేషం. అందుకే ఇతడిని పంజాబ్ కింగ్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది.
రాజ్వర్ధన్ హంగార్గెకర్ (Rajvardhan Hangargekar): ఇటీవల ముగిసిన అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత్ సత్తా చాటిన రాజ్‌వర్ధన్‌ను మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ () రూ.1.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. అండర్-19 ప్రపంచకప్‌తో పాటు... ఆ మెగా టోర్నీ ముందు వరకు కూడా ఆడిన 8 యూత్ వన్డేల్లో 10 వికెట్లు తీసి ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా కీలక సమయాల్లో బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో 5సిక్సర్లు, 1 ఫోర్‌తో 39 పరుగులు చేశాడు. భారీ సిక్సర్లు బాదిన ఇతడిని చెన్నై వేలంలో సొంతం చేసుకుంది.
యశ్ ధుల్ (Yash Dhull): ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. మెగా వేలంలో ఇతడిని రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 100 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అనంతరం కోవిడ్-19 బారిన పడి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో 20 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఇక సెమీస్‌లో సెంచరీ చేసి ఆసీస్‌పై భారత్ గెలిచేందుకు సాహయపడ్డాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.