Home /News /sports /

U19 WORLD CUP 2022 INDIA VS IRELAND IND QUALIFY FOR SUPER LEAGUE QUARTERFINALS WITH 174 RUN WIN OVER IRELAND SK

U-19 World Cup: ప్రపంచ కప్‌లో యువ భారత్ జోష్.. ఐర్లాండ్‌పై భారీ విజయం

India U19 vs Ireland U19 Highlights, World Cup 2022: భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాల కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది

India U19 vs Ireland U19 Highlights, World Cup 2022: భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాల కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది

India U19 vs Ireland U19 Highlights, World Cup 2022: భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాల కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది

    India U19 vs Ireland U19 Highlights, World Cup 2022: అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఒడించిన యువ జట్టు.. తాజాగా ఐర్లాండ్‌ టీమ్‌ను ఉఫ్‌మని ఊదేసింది. 174 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. కెప్టెన్ యశ్ దుల్‌ సహా ఆరుగురు ఆటగాళ్లకు కరోనా రావడంతో.. నిశాంత్ సింధు నేతృత్వంలో బరిలోకి దిగింది భారత జట్టు. ఓపెనర్లు హర్నూర్ సింగ్, రఘువంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారీ స్కోర్ చేశారు. వీరిద్దరు అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్లు 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు ఔటయిన తర్వాత మిడిలార్డర్ కూడా చక్కగా రాణించింది. రాజ్ భవా (42) ఆచితూచి ఆడాడు. కానీ చివర్లో కెప్టెన్ నిషాంత్ (36), రాజ్‌వర్ధన్ (39) సిక్సర్లతో విరుచుకుపడి టీమ్‌కు భారీ స్కోర్ అందించారు. ఈమ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు లేకున్నప్పటికీ యంగ్ ఇండియా అదరగొట్టింది.

    Ind Vs Sa : ఫస్ట్ వన్డేలో విక్టరీ సౌతాఫ్రికాదే.. నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ..

    308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఐర్లాండ్.. మొదటి నుంచే బెంబేలెత్తిపోయింది. బౌలర్ల బుల్లెల్లాంటి బాల్స్‌కు బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయారు. మొదటి 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 36 పరుగులకు 4 వికెట్లు పడడంతో.. పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమయింది. మిడిలార్డర్‌లో స్కాట్ మెక్‌బెత్ (32), జోషు కాక్స్ (28)తో రాణించారు. ఇంకెవరూ చెప్పుకోదగ్గ సోర్స్ చేయలేదు. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో.. ఐర్లాండ్ ఆలౌటయింది. 39 ఓవర్లలో 133 పరుగులు చేసి మొత్తం 10 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు సమష్ఠిగా అదరగొట్టారు. సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌషల్ తంబే తలో రెండు వికెట్లు తీయగా... విక్కీ ఓస్వాల్, రవికుమార్, రాజవర్ధన్ తలో వికెట్ తీశారు. హర్నూర్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

    ఒడియమ్మ మ్యాక్స్‌వెల్.. నీ బాదుడుకి దండం సామీ.. 64 బంతుల్లో సునామీ

    కాగా, అండర్-19 ప్రపంచకప్‌లో కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాల కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆరాధ్య యాదవ్, వాసు వల్స్ మనవ్ పరబ్, సిద్ధార్ద్ యాదవ్‌కు కోవిడ్ సోకిందని ఓ అధికారి ANI వార్తా సంస్థకు తెలిపారు. కరోనా బారిన పడిన భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. మంగళవారం నలుగురు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారితో దగ్గరగా మెలిగిన మరికొందరికి పరీక్షలు చేయించగా.. బుధవారం ఉదయం కెప్టెన్, వైస్ కెప్టెను కూడా పాజిటివ్‌గా తేలింది.

    Sania Mirza : ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలు..కానీ, సానియా రూటే వేరు..!

    ఈ నేపథ్యంలో ట్రినిడాడ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. ఐనప్పటికీ భారత్ భారీ విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ టోర్నీలో శుభారంభం చేసిన భారత్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించి.. క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. శనివారం యుగాండాతో తలపడనుంది. గ్రూప్ బీలో భారత్‌కు ఇదే ఆఖరు మ్యాచ్. కరోనా బారినపడిన ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Sports, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు