IND vs BAN : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

India vs Bangladesh Under 19 World Cup Final : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు కచ్చితంగా గెలుస్తుందనే అంచనాలున్నాయి.


Updated: February 9, 2020, 1:47 PM IST
IND vs BAN : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
IND vs BAN : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • Share this:
India vs Bangladesh Under 19 World Cup Final : భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ కివీస్ వశం అవ్వడంతో నిరాశ చెందిన భారత క్రికెట్ అభిమానులకు మరో ఉత్కంఠ భరిత మ్యాచ్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్‌ ఫైనల్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లీగ్ మ్యాచ్‌ల నుంచి సెమీ ఫైనల్స్ వరకు తిరుగులేని విజయాలతో దూసుకొచ్చిన భారత జట్టు ఫైనల్స్‌‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో కచ్చితంగా కప్ గెలుస్తుందంటున్నారు అభిమానులు. ఇప్పటికే నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత్ మరోసారి ఆ ఛాన్స్ కొట్టబోతోంది. లక్కేంటంటే ఏ మాత్రం అంచనాల్లేని బంగ్లాదేశ్ యువ జట్టు మొదడటిసారిగా ఈసారి వరల్డ్ కప్‌లో చక్కటి ఆట తీరు కనబరిచి ఫైనల్ దాకా వచ్చింది. అందువల్ల ఫైనల్ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పులూ లేకుండానే టీమిండియా బరిలో దిగితే... బంగ్లాదేశ్ మాత్రం హసన్ మురాద్ స్థానంలో అవిషేక్ దాస్‌సు ఫైనల్ జట్టులో దింపింది. ఇవాళ్టి మ్యాచ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం కాదు. మరీ ఎక్కువ రన్స్ రావు. పైగా వర్షం పడే అవకాశాలూ ఉన్నాయి. అందువల్ల మ్యాచ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

భారత జట్టు : ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, దివ్యాంశ్‌, తిలక్‌ వర్మ, ధ్రువ్‌ జురెల్‌, సిద్దేశ్‌ వీర్‌, అథర్వ, రవి బిష్ణోయ్‌, శస్వాత్‌, కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌

బంగ్లాదేశ్‌ జట్టు : అక్బర్‌ అలీ (కెప్టెన్‌), పర్వేజ్‌, తన్‌జీద్‌, మహ్మదుల్‌ హసన్‌, తౌహిద్‌, షహాదత్‌, అవిషేక్‌ దాస్, షమీమ్‌, రకీబుల్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ షకిబ్
First published: February 9, 2020, 1:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading