U-19 World Cup 2023 : అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ (U-19 Women's World Cup 2023)లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల (Australia Women's Team) జట్టు చేతిలో టీమిండియా (Team India) ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమి నుంచి భారత్ వెంటనే తేరుకుంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఆదివారం శ్రీలంక (Sri Lanka Women's Team) మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 59 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో పర్షవి చోప్రా 4 వికెట్లతో అదరగొట్టిందిి. మన్నత్ కశ్యప్ 2 వికెట్లు తీసింది. సాధు, అర్చన దేవిలకు ఒక్కో వికెట్ చొప్పున లభించింది. శ్రీలంక తరఫున కెప్టెన్ విష్మి గుణరత్నే (28 బంతుల్లో 25; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఈమెతో పాటు ఉమయ రత్నాయకె (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ ను అందుకుంది. మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఇక మ్యాచ్ లో భారత్ ఒకే ఒక్క ఎక్స్ ట్రాను వైడ్ రూపంలో ఇవ్వడం విశేషం.
టాస్ ఓడిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. షఫాలీ వర్మ తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ అంటూ భారత బౌలర్లు రెచ్చిపోయారు. తొలి బంతికే సెనరత్నె (0)ను గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు పంపింది సాధు. ఇక్కడి నుంచి శ్రీలంక వరుస పెట్టి వికెట్లను కోల్పోయింది. షఫాలీ వర్మ ఈ మ్యాచ్ లో కేవలం ఒకే ఒక పేసర్ తో బరిలోకి దిగింది. దాంతో మిగిలిన 16 ఓవర్లను స్పిన్నర్లే వేయడం విశేషం. ఈ క్రమంలో బౌలింగ్ కు వచ్చిన చోప్రా నాలుగు వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచింది. ఓపిగ్గా ఆడుతున్న గుణరత్నేను అవుట్ చేసి శ్రీలంకను కోలుకోనీయకుండా చేసింది.
మ్యాచ్ ను ఎక్కడ చూడాలి?
ఈ మ్యాచ్ ను ఫ్యాన్ కోడ్ యాప్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ యాప్ ద్వారా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే అండర్ 19 సూపర్ సిక్స్ మ్యాచ్ ను చూడొచ్చు.
తుది జట్లు
శ్రీలంక అండర్ 19 మహిళల జట్టు
సెనెరత్నే, సిసంసల, గుణరత్నే, విహంగ, ననయక్కర, రత్నయకె, దిస్సనయకే, సెవండి, పెరీరా, సంజన, నేత్రాంజలి
టీమిండియా అండర్ 19 మహిళల జట్టు
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్, సౌమ్య తివారి, త్రిష, రిచా ఘోష్, బసు, సాధు, కశ్యప్, అర్చన దేవి, చోప్రా, సోనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, India vs srilanka, South Africa, Sri Lanka, Team India