హోమ్ /వార్తలు /క్రీడలు /

U-19 World Cup 2023 : లేడీ సెహ్వాగ్.. లేడీ ధోని విఫలమైనా.. ప్రపంచకప్ లో టీమిండియా మరో విజయం

U-19 World Cup 2023 : లేడీ సెహ్వాగ్.. లేడీ ధోని విఫలమైనా.. ప్రపంచకప్ లో టీమిండియా మరో విజయం

PC : ICC

PC : ICC

U-19 World Cup 2023 : అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ (U-19 Women's World Cup 2023)లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల (Australia Women's Team) జట్టు చేతిలో టీమిండియా (Team India) ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమి నుంచి భారత్ వెంటనే తేరుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

U-19 World Cup 2023 : అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ (U-19 Women's World Cup 2023)లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల (Australia Women's Team) జట్టు చేతిలో టీమిండియా (Team India) ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమి నుంచి భారత్ వెంటనే తేరుకుంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఆదివారం శ్రీలంక (Sri Lanka Women's Team) మహిళల జట్టుతో జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీలంక విసిరిన 60 పరుగుల లక్ష్యాన్ని 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి నెగ్గింది. ఈ మ్యాచ్ లో సౌమ్య తివారి (15 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు) టీమిండియాను గెలిపించింది. కెప్టెన్ షఫాలీ వర్మ (15) వేగంగా పరుగులు చేసే క్రమంలో వికెట్ పారేసుకుంది. రిచా ఘోష్ (4) మరోసారి నిరాశ పరిచింది. శ్వేత షెరావత్ (13) సౌమ్య తివారీతో మూడో వికెట్ కు 35 పరుగులు జోడించి ఆఖర్లో అవుటైంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 59 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో పర్షవి చోప్రా 4 వికెట్లతో అదరగొట్టిందిి. మన్నత్ కశ్యప్ 2 వికెట్లు తీసింది. సాధు, అర్చన దేవిలకు ఒక్కో వికెట్ చొప్పున లభించింది. శ్రీలంక తరఫున కెప్టెన్ విష్మి గుణరత్నే (28 బంతుల్లో 25; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఈమెతో పాటు ఉమయ రత్నాయకె (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ ను అందుకుంది. మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఇక మ్యాచ్ లో భారత్ ఒకే ఒక్క ఎక్స్ ట్రాను వైడ్ రూపంలో ఇవ్వడం విశేషం.

టాస్ ఓడిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. షఫాలీ  వర్మ తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ అంటూ భారత బౌలర్లు రెచ్చిపోయారు. తొలి బంతికే సెనరత్నె (0)ను గోల్డెన్ డక్ గా పెవిలియన్ కు పంపింది సాధు. ఇక్కడి నుంచి శ్రీలంక వరుస పెట్టి వికెట్లను కోల్పోయింది. షఫాలీ వర్మ ఈ మ్యాచ్ లో కేవలం ఒకే ఒక పేసర్ తో బరిలోకి దిగింది. దాంతో మిగిలిన 16 ఓవర్లను స్పిన్నర్లే వేయడం విశేషం. ఈ క్రమంలో బౌలింగ్ కు వచ్చిన చోప్రా నాలుగు వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచింది. ఓపిగ్గా ఆడుతున్న గుణరత్నేను అవుట్ చేసి శ్రీలంకను కోలుకోనీయకుండా చేసింది.

First published:

Tags: India, India vs srilanka, South Africa, Sri Lanka, Team India

ఉత్తమ కథలు