U-19Women's World Cup 2023 : మహిళల క్రికెట్ లో కొత్త చరిత్రను లిఖించే అవకాశం భారత క్రికెట్ జట్టుకు (Indian cricket team) వచ్చింది. దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా తొలిసారి జరుగుతున్న్ అండర్ 19 మహిళల ప్రపంచకప్ ను గెలిచే అవకాశం యువ భారత్ కు వచ్చింది. మరికాసేపట్లో ఆరంభమయ్యే ఫైనల్లో షఫాలీ వర్మ (Shafali Verma) నాయకత్వంలోని టీమిండియా (Team India) ఇంగ్లండ్ (England)తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫైనల్ పోరు కోసం భారత జట్టు ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లండ్ కూడా దూకుడు మీదుంది. ఈ మ్యాచ్ ను ఫ్యాన్ కోడ్ యాప్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ అంచనాలను అందుకుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి సూపర్ 6కు అర్హత సాధించింది. అయితే సూపర్ 6లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. ఆ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న భారత్.. శ్రీలంకపై నెగ్గి సెమీస్ చేరింది. ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 107 పరుగులకే పరిమితం అయ్యింది. ఆ స్కోరును భారత్ 15 ఓవర్ల లోపే ఛేదించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇక అదే సమయంలో ఇంగ్లండ్ మాత్రం ఫైనల్ చేరడానికి ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. అయితే అనంతరం ఆసీస్ ను 96 పరుగులకు కట్టడి చేసి 3 పరుగులతో నెగ్గి ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది. ఓపెనర్ శ్వేత షెరావత్ సూపర్ ఫామ్ లో ఉంది. అయితే షఫాలీ వర్మ ధాటిగా ఆడటంలో విఫలం అవుతుంది. ఒకటి రెండు భారీ షాట్లు ఆడి పెవిలియన్ కు చేరుకుంటుంది. ఇక రిచా ఘోష్ ఏ స్థానంలోనైనా వచ్చి భారీ షాట్లు ఆడగలదు. వీరితో పాటు మిగిలిన ప్లేయర్లు కూడా మంచి టచ్ లో ఉండటం భారత్ కు కలిసి వచ్చే అంశం.
తుది జట్లు
ఇంగ్లండ్
గ్రేస్ స్క్రీవెన్స్ (కెప్టెన్), లిబర్టీ హీప్, హోలాండ్, సెరెన్ స్మెల్, క్రిస్ పావెలీ, రైన్ మెక్ డొనాల్డ్, అలెక్సా, గ్రూవ్స్, అండర్సన్, సోఫియా స్మెల్, హన్నా బేకర్
టీమిండియా
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్, సౌమ్య తివారి, త్రిష, రిచా ఘోష్, బసు, సదు, కశ్యప్, అర్చన దేవి, చోప్రా, సోనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND VS ENG, India vs england, Team India, World cup