U-19 Women's World Cup : సౌతాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న మహిళల అండర్ 19 ప్రపంచకప్ (U-19 Womens World Cup)లో టీమిండియా (Team India) మహిళల జట్టు రెచ్చిపోతుంది. మొన్న దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై గెలుపొందిన షఫాలీ వర్మ (Shafali Verma) టీం.. మరో విజయంపై కన్నేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా సోమవారం జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ షపాలీ వర్మ (34 బంతుల్లో 78; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) యూఏఈ బౌలింగ్ ను ఊచకోత కోసింది. మరో ఓపెనర్ శ్వేత షెరావత్ (49 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు) అదరగొట్టింది. రిచా ఘోష్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించింది. దాంతో భారత్ భారీ స్కోరును అందుకుంది. యూఏఈ బౌలర్లలో ఇందూజ, మహిక, సమైర తలా ఒక వికెట్ సాధించారు.
ఇది కూడా చదవండి : 2023లో 3 టార్గెట్స్ ను ఫిక్స్ చేసిన టీమిండియా.. వీటిని సాధించేంత వరకు నో రెస్ట్
టాస్ గెలిచిన యూఏఈ ఫీల్డింగ్ ఎంచుకుంది. యూఏఈ కెప్టెన్ కు తాను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో తెలిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు. ఓపెనర్లుగా శ్వేత, షఫాలీ వర్మలు క్రీజులోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే షఫాలీ వర్మ యూఏఈ బౌలర్లపై విరుచుకుపడింది. తనను లేడీ సెహ్వాగ్ అని ఎందుకు అంటారో మరోసారి చాటి చెప్పింది. ఈమె దెబ్బకు భారత స్కోరు బోర్డు రాకెట్ వేగంతో కదిలింది. బౌలంగ్ కు వచ్చిన ప్రతి బౌలర్ ను బౌండరీలతో స్వాగతం పలికింది. మరో ఎండ్ లో ఉన్న శ్వేత కూడా దూకుడు కనబరిచింది.
సౌతాఫ్రికాపై కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్వేత అదే ఫామ్ ను ఇక్కడ కూడా కొనసాగించింది. ఈ క్రమంలో షఫాలీ వర్మ, శ్వేతలు అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ కేవలం 8.3 ఓవర్లలనే 111 పరుగులు జోడించారు. సెంచరీ చేసేలా కనిపించిన షపాలీ వర్మ ఇందూజ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుటైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ కూడా మెరుపులు మెరిపించింది. వీరిద్దరూ 89 పరుగులు జోడించారు. దాంతో భారత స్కోరు బోర్డు 200ను అందుకుంది. అర్ధ సెంచరీకి పరుగు దూరంలో రిచా ఘోష్ పెవిలియన్ కు చేరింది. ఇక చివర్లో శ్వేత ధాటిగా ఆడటంతో భారత్ 219 పరుగులను చేరుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India, South Africa, Team India