హోమ్ /వార్తలు /క్రీడలు /

U 19 Women's World Cup 2023 : చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా.. గెలిస్తే మహిళల క్రికెట్ లో సువర్ణ అధ్యాయం

U 19 Women's World Cup 2023 : చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా.. గెలిస్తే మహిళల క్రికెట్ లో సువర్ణ అధ్యాయం

PC : ICC

PC : ICC

U 19 Women's World Cup 2023 : మహిళల క్రికెట్ లో సువర్ణ అధ్యాయాన్ని లిఖించే అవకాశం భారత క్రికెట్ జట్టుకు (Indian cricket team) వచ్చింది. మహిళల క్రికెట్ లో అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ (World Cup)ను అందుకునే అవకాశం భారత్ కు వచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

U 19 Women's World Cup 2023 : మహిళల క్రికెట్ లో సువర్ణ అధ్యాయాన్ని లిఖించే అవకాశం భారత క్రికెట్ జట్టుకు (Indian cricket team) వచ్చింది. మహిళల క్రికెట్ లో అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ (World Cup)ను అందుకునే అవకాశం భారత్ కు వచ్చింది. భారత పురుషుల జట్టు ఇప్పటికే రెండు సార్లు వన్డే ప్రపంచకప్ ను.. ఒకసారి టి20 ప్రపంచకప్ ను అందుకుంది. ఇక అండర్ 19 విభాగంలో కూడా ప్రపంచకప్ లను అనేక సార్లు గెలిచింది. ఇక మహిళల విభాగంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అండర్ 19 ప్రపంచకప్ లో భారత యువ టీం సత్తా చాటింది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ పొట్టి ప్రపంచకప్ లో ఆద్యంతం నిలకడైన ప్రదర్శన కనబర్చిన షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత్.. చరిత్రకు అడుగు దూరంలో నిలిచింది.

అండర్ 19 ప్రపంచకప్ కిరీటం కోసం ఆదివారం భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం గం. 5.15లకు ఆరంభం కానుంది. ఇందులో భారత్ గెలిస్తే మాత్రం మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్ర లిఖించినట్లు అవుతుంది. మహిళల క్రికెట్ (సీనియర్, జూనియర్) లో భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ ను ముద్దాడలేకపోయింది. వన్డే ప్రపంచకప్ లో 2005, 2017లలో రన్నరప్ గా నిలిచిన భారత్.. టి20 ప్రపంచకప్ లో 2020లో రన్నరప్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్లో భారత మహిళల జట్టు గెలిస్తే అది చరిత్రే అవుతుంది.

టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ అంచనాలను అందుకుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి సూపర్ 6కు అర్హత సాధించింది. అయితే సూపర్ 6లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. ఆ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న భారత్.. శ్రీలంకపై నెగ్గి సెమీస్ చేరింది. ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 107 పరుగులకే పరిమితం అయ్యింది. ఆ స్కోరును భారత్ 15 ఓవర్ల లోపే ఛేదించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇక అదే సమయంలో ఇంగ్లండ్ మాత్రం ఫైనల్ చేరడానికి ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. అయితే అనంతరం ఆసీస్ ను 96 పరుగులకు కట్టడి చేసి 3 పరుగులతో నెగ్గి ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది. ఓపెనర్ శ్వేత షెరావత్ సూపర్ ఫామ్ లో ఉంది. అయితే షఫాలీ వర్మ ధాటిగా ఆడటంలో విఫలం అవుతుంది. ఒకటి రెండు భారీ షాట్లు ఆడి పెవిలియన్ కు చేరుకుంటుంది. ఇక రిచా ఘోష్ ఏ స్థానంలోనైనా వచ్చి భారీ షాట్లు ఆడగలదు. వీరితో పాటు మిగిలిన ప్లేయర్లు కూడా మంచి టచ్ లో ఉండటం భారత్ కు కలిసి వచ్చే అంశం.

First published:

Tags: England, IND VS ENG, India, India vs england, South Africa, Team India, World cup

ఉత్తమ కథలు