Home /News /sports /

U 19 ASIA CUP 2021 TEAM INDIA STORMS INTO FINAL AFTER GRAND VICTORY AGAINST BANGLADESH SRD

U-19 Asia Cup 2021 : ఇరగదీసిన గుంటూరు కుర్రాడు.. ఫైనల్ లోకి భారత్.. ప్రత్యర్ధి ఎవరంటే..

Sheikh Rashid

Sheikh Rashid

U-19 Asia Cup 2021 : అండర్-19 ఆసియా కప్ (U-19 Asia Cup 2021) సెమీస్‌లో భారత జట్టు (Team India) దుమ్మురేపింది. యశ్ దుల్ నాయకత్వంలోని యంగ్ భారత్ ఫైనల్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది.

    అండర్-19 ఆసియా కప్ (U-19 Asia Cup 2021) సెమీస్‌లో భారత జట్టు (Team India) దుమ్మురేపింది. యశ్ దుల్ నాయకత్వంలోని యంగ్ భారత్ ఫైనల్‌లోకి సగర్వంగా అడుగుపెట్టింది. బంగ్లా అండర్-19 జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్‌ బ్యాటింగ్‌లో గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ (108 బంతుల్లో 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన షేక్‌ రషీద్‌ 90 పరుగుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే బౌండరీల రూపంలో వచ్చాయి. ఇక కెప్టెన్‌ యష్‌దుల్‌ 26 పరుగులు, రాజ్‌ భవా 23 పరుగులు చేశారు.

    బంగ్లాదేశ్‌ బౌలర్లలో రకీబుల్‌ హసన్‌ 3 వికెట్లు తీయగా.. మిగతావారు తలా ఒక వికెట్‌ తీశారు. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి కూడా వైస్ కెప్టెన్‌గా ఎంపికైనా షేక్ రషీద్, ఆసియా కప్ టోర్నీలో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా కీలక మ్యాచ్‌లో జట్టును ఆదుకున్నాడు.

    ఆ తర్వాత 244 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లా జట్టు, 38.2 ఓవర్లలో 140 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బంగ్లా తరుపున అరిఫుల్ ఇస్లాం 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా ఓపెనర్ మహ‌ఫిజుల్ ఇస్లాం 26 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రాజ్‌వర్థన్ హంగేర్కర్ , రవికుమార్, రాజ్ భవ, విక్కీ ఓత్సవల్ రెండేసి వికెట్లు తీయగా నిశాంత్ సింధు, కుశాల్ తంబే చెరో వికెట్ తీశారు.



    మరో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన శ్రీలంక, ఫైనల్‌కి అర్హత సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, శ్రీలంక జట్టును 44.5 ఓవర్లలో 147 పరుగులకి ఆలౌట్ చేసింది. జీశన్ జమీర్ 4 వికెట్లు తీయగా అహ్మద్ ఖాన్, అవైస్ ఆలీ రెండేసి వికెట్లు తీశారు. అర్హమ్ నవాబ్, మర్జ్ సదావత్ చెరో వికెట్ తీశారు. 148 పరుగుల ఈజీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు.

    ఇది కూడా చదవండి : రోహిత్ వ‌ర్సెస్ కోహ్లీ.. హిట్ ఎవరు.. ఫట్ ఎవరు..? లెక్కలు ఏం చెబుతున్నాయంటే..

    ఓపెనర్ సదావత్, వికెట్ కీపర్ హసీబుల్లా డకౌట్ కాగా, మహ్మదుల్లా షాజద్ 75 బంతుల్లో ఓ ఫోర్‌తో 30 పరుగులు, కెప్టెన్ ఖాసీం అక్రమ్ 19, ఇర్ఫాన్ ఖాన్ 13, అహ్మద్ ఖాన్ 36, రిజ్వాన్ మహ్మద్ 6 పరుగులు, జీషన్ జమీర్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 49.3 ఓవర్లలో 125 పరుగులకి ఆలౌట్ అయినా పాకిస్తాన్ జట్టు, 22 పరుగుల తేడాతో ఓడింది. లంక బౌలర్లలో త్రీవీన్ మాథ్యూ 10 ఓవర్లలో 3 మెయిడిన్లతో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. డిసెంబర్ 31న శ్రీలంక జట్టుతో అండర్19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, ICC Under 19 World Cup, India vs bangladesh, Team india

    తదుపరి వార్తలు