Home /News /sports /

TWO WEST INDIES WOMEN CRICKETERS COLLAPSED ON FIELD FREAKING INCIDENT HAPPENED IN 10 MIN DURATION JNK

Cricket : 10 నిమిషాల వ్యవధిలో షాకింగ్ ఘటనలు.. మైదానంలోనే కుప్పకూలిన వెస్టిండీస్ క్రికెటర్లు - Video

మైదానంలో కుప్పకూలిన మహిళా క్రికెటర్లు (Screen Grabber)

మైదానంలో కుప్పకూలిన మహిళా క్రికెటర్లు (Screen Grabber)

ఇద్దరు వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు మైదానంలో కుప్పకూలడం సంచలనం సృష్టించింది. అంటిగ్వాలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మైదానంలో కుప్పకూలారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది.

    వెస్టిండీస్-పాకిస్తాన్ (West Indies Vs Pakistan) మహిళా జట్ల (Women's Team) మధ్య ఆంటిగ్వాలో శుక్రవారం జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు అనూహ్య సంఘటనలు 10 నిమిషాల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. అకస్మాత్తుగా వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు చినెల్లీ హెన్రీ (Chinelly Henry), చెడియాన్ నేషన్ (Nation) మైదానంలోనే కుప్పకూలిపోయారు. అసలేం జరుగుతుందో అర్దం కాక మైదానంలోని క్రికెటర్లు, అంపైర్లే కాక టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆందోళనకు గురయ్యారు. ముందు వెస్టిండీస్ ప్లేయర్ హెన్రీ మైదానంలో కుప్పకూలిపోయింది. వెంటనే వైద్య సిబ్బంది అక్కడకు చేరుకొని స్ట్రెచర్‌పై ఆమెను అక్కడి నుంచి తరలించారు. తిరిగి ఆట ప్రారంభమైన 10 నిమిషాలకే చెడియాన్ నేషన కూడా అలాగే పడిపోయింది. వైద్య సిబ్బంది మరోసారి వచ్చి నేషన్‌ను స్ట్రెచర్‌పై బయటకు తీసుకొని వెళ్లారు. కాగా ఈ రెండు సంఘటనలతో ఆటలో గందరగోళం ఏర్పడింది. అయితే వారిద్దరూ ఎందుకు మైదానంలో కుప్పకూలిపోయారో ఇంకా వివరాలు తెలియరాలేదు. అయితే ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది.

    కాగా, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు గెలుపొందింది. విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేసియా నైట్ 20 బంతుల్లో 30 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. పాకిస్తాన్ బౌలర్ ఫాతిమా సన 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది.









    లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు తడబడింది. 18 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో 6 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్దతిలో వెస్టిండీస్ రెండో టీ20 గెలిచింది. ఈ విజయంతో వెస్టిండీస్ జట్టు మరో మ్యాచ్ ఉండగానే టీ20 సిరీస్ ఎగరేసుకొని పోయింది. చివరి టీ20 జులై 4న జరుగనున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cricket, T20, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు