IPL 2019 : అశ్విన్ చేసిన ఆ రెండు తప్పుల వల్ల... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకుందా?

Kings XI Punjab vs Kolkata Knight Riders : పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఈడెన్ గార్డెన్‌లో చేసిన రెండు పొరపాట్లు... ఆ జట్టు ఓటమికి దారితీశాయి.

news18-telugu
Updated: March 28, 2019, 1:05 PM IST
IPL 2019 : అశ్విన్ చేసిన ఆ రెండు తప్పుల వల్ల... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకుందా?
రవిచంద్రన్ అశ్విన్
  • Share this:
Kings XI Punjab vs Kolkata Knight Riders : ఈడెన్ గార్డెన్‌లో ఎలాంటి మార్పులూ లేకుండా కోల్‌కతా నైట్ రైడర్స్ బరిలో దిగగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో మాత్రం నాలుగు మార్పులు జరిగాయి. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులో ఎంటరవ్వడం వాటిలో ఒకటి. నాలుగు మార్పులు చేసినా జట్టు విజయానికి అవేవీ ఉపయోగపడలేదు. రవిచంద్రన్ అశ్విన్ పూర్ కెప్టెన్సీ వల్ల గెలిచే మ్యాచ్ కాస్తా కోల్‌కతా వశమైనట్లైంది. నైట్ రైడర్స్ జట్టులో నితీశ్ రానా 34 బాల్స్‌కి ఏకంగా 63 రన్స్ బాదేశాడు. అండ్రూ రసెల్ 17 బంతులు ఫేస్ చేసి... 48 రన్స్ తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఫలితంగా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆ జట్టు 218 రన్స్ చేసింది. ఐపీఎల్ ఈవెంట్‌లో ఇదే అత్యంత ఎక్కువ స్కోర్. ఆరంభంలోనే తడబడిన పంజాబ్... మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిలవ్వడంతో... లక్ష్యానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయింది ఆ జట్టు.

కీలకమైన ఫీల్డింగ్ రూల్ అశ్విన్ ఎలా మర్చిపోయాడు : తొలి మ్యాచ్‌లోలాగానే రసెల్ ఈ మ్యాచ్‌లో కూడా స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. భీకర షాట్లతో పంజాబ్ బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. టై బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4, 6, బాదేసిన అతడు... షమి బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 4 పరుగులతో షాకిచ్చాడు. నిజానికి అతడు 3 పరుగుల దగ్గరే ఔట్ కావాల్సింది. కానీ పంజాబ్‌ను దురదృష్టం నోబాల్ రూపంలో వెంటాడింది. 17వ ఓవర్లో షమి పదునైన యార్కర్‌తో రసెల్‌ను బౌల్డ్ చేశాడు. కానీ బౌండరీ లోపల కనీసం నలుగురు ఫీల్డర్స్ ఉండాల్సి ఉండగా... ముగ్గురు ఫీల్డర్లే ఉండటంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు. అది రసెల్‌కి కలిసొచ్చింది. ఆ తర్వాత కోల్‌కతా 19 బాల్స్‌లో 56 రన్స్ చేసింది. చివరకి మ్యాచ్ ఫలితంలో రసెల్ ఇన్నింగ్సే కీలకమైంది. ఆ నోబాల్ కొంపముంచినట్లైంది.

సునీల్ నరైన్‌కి వరుణ్ చక్రవర్తి ఎందుకు : స్పిన్నర్లను ఎదుర్కోవడంలో నరైన్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అశ్విన్ ఆ విషయాన్ని ఎలా మర్చిపోయాడు. 17 ఇన్నింగ్స్‌లో నరైన్ ఆరుసార్లు మాత్రమే డిస్మిస్ అయ్యాడు. పవర్ ప్లేలో 259 యావరేజ్‌ ఉంది. తాజా మ్యాచ్‌లో నరైన్... ఓపెనర్‌గా దిగి... పరుగుల సునామీని మొదలుపెట్టగా ఊతప్ప, నితీశ్ రానా, రసెల్ దాన్ని కొనసాగించారు. నరైన్ 9 బంతుల్లో 24 పరుగులు చెయ్యగా... రానా 34 బాల్స్ ఫేస్ చేసి... 63 పరుగులు, ఊతప్ప 50 బంతుల్లో 67 నాటౌట్, రసెల్స్ 17 బంతుల్లో 48 పరుగులతో తిరుగులేని ఇన్నింగ్స్ ఆడారు. ఇలాంటి తప్పిదాలు... పంజాబ్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాయి.


ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపిఎల్) 2019లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ జట్టులో రాహుల్ 1, గేల్ 20, అగర్వాల్ 58, ఖాన్ 13, మిల్లర్ 58, మన్‌దీప్ సింగ్ 33 పరుగులు చేశారు.

మ్యాచ్ చివర్లో ఓటమికి తనదే బాధ్యత అని అశ్విన్ ఒప్పుకున్నాడు. నోబాల్ విషయంలో జాగ్రత్త పడి ఉండాల్సిందని చెప్పుకున్నాడు. చిన్న చిన్న విషయాలు కూడా మ్యాచ్ గతిని మార్చేస్తాయని ఈ మ్యాచ్‌తో అర్థమైందన్నాడు. నెక్ట్స్ గేమ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపాడు.

 

ఇవి కూడా చదవండి :

జీవా, గ్రేషియా బెస్ట్ ఫ్రెండ్స్... ఇంతకీ ఎవరి కూతుర్లో తెలుసా...

ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల... అమ్మాయిల ఫొటోలు, డబ్బులు అడుగుతూ...

లవంగాలు మనకు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా... ఎన్ని ప్రయోజనాలో... రోజూ తినాల్సిందే.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>