TWO DAYS BEFORE GIVING BIRTH TO IZHAAN I WAS PLAYING TENNIS SANIA MIRZA NK
ప్రెగ్నెన్సీని భరించలేక టెన్నిస్ ఆడా : సానియా మీర్జా
సానియా మీర్జా (Image : Instagram - mirzasaniar)
Sania Mirza : త్వరలో రాబోతున్న ఎపిసోడ్ "ది లవ్ లాఫ్ లైవ్ షో"లో ఏస్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతోంది. తన కొడుకు ఇజాన్ గురించి కూడా ఆసక్తికర అంశాలు బయటపెడుతోంది.
అది 2018. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతుల ఇంట పండగ వాతావరణం. ఎందుకంటే... వాళ్లకు అప్పుడే ఇజాన్ పుట్టాడు. ఇక అప్పటి నుంచీ సానియా మీర్జా... ఇజాన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ... పెంచుతోంది. అప్పుడప్పుడూ... ఇజాన్కి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేస్తూ... తన అభిమానులకు అప్డేట్స్ అందిస్తోంది. తాజాగా సానియా... ది లవ్ లాఫ్ లైవ్ షో అనే ఎపిసోడ్ చేస్తోంది. ఈ షోను రోమెడీ నౌ... ప్రసారం చెయ్యనుంది. ఇందులో సానియా తన ప్రెగ్నెన్సీ డేస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పనుంది. ఇజాన్ పుట్టే రెండ్రోజుల ముందు కూడా తాను టెన్నిస్ ఆడినట్లు తాజాగా ఆమె బయటపెట్టింది.
కడుపులో 9 నెలల బిడ్డను మొయ్యలేకపోయిన సానియా మీర్జా చాలా అనారోగ్యం చెందినట్లు తెలిపింది. ఎలాగైనా బిడ్డను బయటకు తేవాలనుకున్న ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదట. ఆ టెన్షన్, ఆ భారం నుంచీ ఉపశమనం పొందేందుకు ఆమె టెన్నిస్ ఆడిందట. కనీసం అలా ఆడుతున్నందువల్లైనా... త్వరగా డెలివరీ అయిపోతుందేమోనని సానియా భావించింది. కానీ ఆమె అనుకున్నట్లు జరగలేదు. టెన్నిస్ ఆడినప్పుడు డెలీవరీ కాలేదు. కానీ... అలా ఆడటం వల్ల తాను మానసికంగా కాస్త ఉపశమనం పొందానని సానియా తాజాగా తెలిపింది.
ఇజాన్ పుట్టాక... సానియా... సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో... ఇజాన్ను తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఐతే... ఆ పోస్టులో ఇజాన్ ఫేస్ కనిపించలేదు. కానీ... ఆ పోస్ట్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇజాన్కి విషెస్ చెప్పారు.
కొత్త షోలో... ప్రెగ్నెన్సీకి సంబంధించి మరిన్ని విషయాలు చెప్పబోతోంది సానియా. ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఎలా అనిపించేదీ, ఎలా బరువు పెరిగిందీ అన్నీ చెప్పబోతోందని తెలిసింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.