ఇండియా - న్యూజీలాండ్ (IND vs NZ) మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలి టెస్టు కోసం ఇరు జట్లు కాన్పూర్ చేరుకున్నాయి. ఇరు జట్లు కాన్పూర్‌లోని ఒక స్టార్ హోటల్‌లో బయోబబుల్ (Bio Bubble) నిబంధనల మధ్య బస చేస్తున్నాయి. ఇండియా (India), న్యూజీలాండ్ (New Zealand) జట్లు హోటల్ నుంచి ప్రాక్టీస్ సెషన్‌కు, మ్యాచ్ రోజు ప్రయాణం చేస్తాయి. ఇక ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఇరు జట్లకు స్టేడియం వద్ద సహా భోజనాన్ని హోటల్ సిబ్బందే అందించనున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి మీల్ వరకు అంతా హోటల్ చెఫ్స్ ఆధ్వర్యంలోనే వంటకాలు తయారవుతాయి. అయితే టీమ్ ఇండియా ప్లేయర్లకు వడ్డించే వంటకాలపై బీసీసీఐ (BCCI) ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందులో బీఫ్ (Beef), పోర్క్ (Pork) అసలు వడ్డించొద్దు అని పేర్కొన్నది. బీఫ్, పోర్క్ ఏ రూపంలో కూడా ఆటగాళ్లకు వడ్డించకూడదని గట్టిగా ఆదేశించింది. ఇక టీమ్ ఇండియా ఆటగాళ్లకు అందించే మాంసం తప్పకుండా హలాల్ (Halal) చేసి ఉండాలని పేర్కొన్నది. అంటే మేక, పొట్టేలు, కోడి మాంసాలు తప్పకుండా హలాల్ చేసి వండాలని చెబుతున్నది. ఇప్పుడు ఈ అంశమే వివాదంగా మారింది.
హలాల్ అనేది ఒక మత వర్గానికి సంబంధించిన విషయమని.. దాన్ని ఆటగాళ్లపై ఎందుకు రుద్దాలని చెబుతున్నది. జట్టులో ఉన్న ఇతర వర్గాలకు చెందిన ఆటగాళ్లను కూడా హలాల్ మాంసం తినమని ఎందుకు బలవంతం చేస్తున్నదని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం టెస్టు జట్టులో ఎంత మంది హలాల్ తప్పని సరిగా తినే వర్గం ఆటగాళ్లు ఉన్నారు? వాళ్ల కోసం జట్టంతా హలాల్ మాంసం తినాలని బలవంతం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ట్విట్టర్‌లో #BCCI_Promotes_Halal అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మన దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తారు. కానీ ఏ మతాన్ని అనుసరించమని బలవంతం చేయరు. ఇదొక లౌకిక దేశం. అలాంటప్పుడు ఒక మత ఆచారాన్ని బీసీసీఐ ఎందుకు అనుసరించమని చెబుతున్నదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.
#BCCI_Promotes_Halal This Trend is on 2nd position. Why non-Muslim cricket players are being asked to consume only Halal food ?@Ramesh_hjs pic.twitter.com/SF6BZnuMuw
— Ganesh Pansare (@GA_Pansare) November 23, 2021
?Most of the members of India's cricket team who call themselves '#secular' are not Muslims, so why is Halal being imposed on all of them❓ ?This incident also comes to mind that the in @BCCI? is promoting Halal Economy?. @SGanguly99#BCCI_Promotes_Halal pic.twitter.com/IWkOjTUYPQ
— Suraj Chavan (@surajchavan_15) November 23, 2021
టీమ్ ఇండియా క్రికెటర్లలో చాలా మంది సెక్యులర్ అని చెప్పుకుంటారు. వారిలో ఎవరూ ముస్లింలు కారు. కానీ బీసీసీఐ మాత్రం వారందరూ హలాల్ మటన్ తినేలా నిబంధనలు పెట్టింది. బీసీసీఐ పరోక్షంగా హలాల్ కమ్యూనిటీ ఆర్థికంగా బలపడటానికి కృషి చేస్తున్నది అని ఆరోపిస్తున్నారు. అయితే టీమ్ ఇండియా డైటీషియన్ల సిఫార్సు మేరకే బీసీసీఐ ఆ నోట్ జారీ చేసినట్లు తెలుస్తున్నది. ఇండియాలో అత్యధిక నాన్ వెజ్ రెస్టారెంట్లు హలాల్ ఫుడ్‌నే సరఫరా చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ నోట్ జారీ చేసినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.