వరల్డ్ కప్ మనదే...భారత జట్టు కూర్పుపై నెటిజన్ల హర్షం

జట్టు కూర్పు అద్భుతంగా ఉందని..సమతూకం పాటించారని కొనియాడుతున్నారు. టోర్నీ గెలిచే సత్తా మనకు ఉందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మరికొందరైతే ప్రపంచ కప్ మనదేనని సోషల్ మీడియాలో అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: May 16, 2019, 6:53 PM IST
వరల్డ్ కప్ మనదే...భారత జట్టు కూర్పుపై నెటిజన్ల హర్షం
icc world cup 2019, World cup 2019 Indian squad, Indian Squad for Icc Worldcup 2019, Rishabh pant icc world cup 2019, Rishabh pant place in team India squad, dinesh karthik vs Rishabh pant, mahendra singh dhoni vs Rishabh pant, రిషబ్ పంత్, వన్డే వరల్డ్‌కప్ క్రికెట్, క్రికెట్ వరల్డ్‌కప్ 2019, భారత జట్టు వరల్డ్ కప్, రిషబ్ పంత్ దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ వన్డే వరల్డ్‌కప్ 2019
  • Share this:
క్రికెట్ ఫ్యాన్స్‌ని ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రపంచ సమరం మొదలవనుంది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో క్రికెట్ ప్రపంచ‌కప్ ప్రారంభం కాబోతోంది. నాలుగేళ్లకు ఓసారి జరిగే వరల్డ్ కప్ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ ఫెస్టివల్..! ఈ మెగా టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతందా అని ఆతురతగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులు. ఈ క్రమంలో పలు దేశాలు తమ జట్ల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాలు ప్రపంచకప్‌కు జట్లని ప్రకటించాయి. తాజాగా భారత్ సైతం వరల్డ్ కప్‌కు ఆడబోయే టీమ్‌ని ప్రకటించింది.


మంగళవారం మధ్యాహ్నం సెలెక్షన్ కమిటీ ప్రకటించిన జట్టుపై క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు. జట్టు కూర్పు అద్భుతంగా ఉందని..సమతూకం పాటించారని కొనియాడుతున్నారు. టోర్నీ గెలిచే సత్తా మనకు ఉందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మరికొందరైతే ప్రపంచ కప్ మనదేనని సోషల్ మీడియాలో అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.ఇవి కూడా చదవండి:

ప్రపంచ కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన..పంత్‌కు దక్కని చోటు

బాల్ లేదు కాని బౌలింగ్ ఉంది... గల్లీ క్రికెట్ వీడియోను రిట్వీట్ చేసిన కేటీఆర్

 
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు