కోహ్లీ-అనుష్కలపై అసభ్యకర జోక్...మండిపడుతున్న ఫ్యాన్స్

కోహ్లీ-అనుష్కలపై ఓ రచయిత్రి ట్విట్టర్‌లో చేసిన అసభ్యకర జోక్ వివాదాన్ని రేపుతోంది. ఆ రచయిత్రి కామెంట్స్ పట్ల నెటిజన్లు, కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

news18-telugu
Updated: January 18, 2020, 2:09 PM IST
కోహ్లీ-అనుష్కలపై అసభ్యకర జోక్...మండిపడుతున్న ఫ్యాన్స్
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ( Virat kohli / Twitter )
  • Share this:
సోషల్ మీడియాలో కాస్త డిఫెరెంట్‌గా పోస్టింగ్ పెట్టాలన్న తాపత్రయంతో కొందరు అనవసరంగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలపై ఓ రచయిత్రి అసభ్యకరమైన జోక్‌ని ట్వీట్ చేసి వివాదంలో చిక్కుకుంది. ఆసీస్‌తో తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైనప్పటి నుంచి కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్‌కి దిగాలన్న అంశంపై తెగ చర్చ జరుగుతుండడం తెలిసిందే.  కేఎల్ రాహుల్‌ని నెం.3లో బ్యాటింగ్‌కి పంపిన కోహ్లీ...తను నెం.4లో బ్యాటింగ్‌కి వచ్చి స్వల్ప పరుగులు(16)కే ఔట్ అయ్యాడు. కోహ్లీది సరైన నిర్ణయంకాదని, తను ఎప్పటిలాగేనా నెం.3లో బ్యాటింగ్‌కి రావాల్సిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తంచేశారు. కోహ్లీ తీసుకున్న ఈ పొరబాటు నిర్ణయం వల్లే టీమిండియా 10 వికెట్ల తేడాతో తొలి వన్డేలో చిత్తుగా ఓడిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని...లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

India vs Sri Lanka: Injury scare for Virat Kohli ahead of Guwahati T20I, విరాట్ కోహ్లీకి గాయం... కెఫ్టెన్‌గా ధావన్ ?
విరాట్ కోహ్లీ


కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలన్న అంశంపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చ జరిగింది. ఈ చర్చలో పాలుపంచుకుంటూ భావన అరోరా అనే ఓ రచయిత్రి కోహ్లీ, అనుష్కలపై అసభ్యకరమైన జోక్ చేసింది. ఆస్ట్రేలియాతో విభిన్న భంగిమల్లో ప్రయత్నిస్తున్న విరాట్ కోహ్లీ...తనతో అలా ప్రయత్నించకపోవడం పట్ల ఆయన భార్య అనుష్క కోపంగా ఉందంటూ ఆమె కామెంట్ చేశారు. సెక్స్ భంగిమగా ద్వంద్వార్థం వచ్చేలా ఆ రచయిత్రి చేసిన కామెంట్స్ నెటిజన్స్‌కి, కోహ్లీ ఫ్యాన్స్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇది కుళ్లు జోక్ అంటూ కొందరు నెటిజన్స్ స్పందించగా...మరికొందరు సదరు రచయిత్రినుద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.


First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు