టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్విటర్‌లో దుమ్మురేపారు. ఈ ఏడాది ట్విటర్ వేదికగా ఎక్కువ చర్చించిన భారత ఆటగాళ్లలో ఈ ముగ్గురూ టాప్‌లో నిలిచారు. ఇక ఎంఎస్ ధోనీ చేసిన రిప్లే ట్వీట్ ట్విట్టర్ లో రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ట్వీట్ ఎంటంటే..అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీకి అభినందనలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు పేజీల లేఖను రాసాడు. దీనిపై స్పందించిన మహీ.. ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలేనని.. మోదీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. అయితే ఈ రిప్లే ట్వీట్ ట్విటర్‌లో రికార్డు సృష్టించింది. అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్‌గా నిలిచింది.
An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు వచ్చే ఏడాది జనవరిలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఆగస్టులో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. '2021 జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం ' అని గర్భవతి అయిన సతీమణి ఫొటోనూ విరాట్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ఏడాది అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్‌గా ఇది నిలిచింది.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020
యాష్ ట్యాగ్‌లో #IPL2020 టాప్‌లో నిలవగా.. #WhistlePodu, #TeamIndiaలు కూడా టాప్-3లో నిలిచాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ ప్రేక్షకుల్లేకుండా సూపర్ సక్సెస్ అయింది. అయితే సీజన్ ప్రారంభమయ్యే వరకు సినిమాను తలపించింది. దాంతో ట్విటర్‌లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. చెన్నై సూపర్ కింగ్స్ స్లోగన్ #WhistlePodu సెకండ్ మోస్ట్ యాష్‌ట్యాగ్‌గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత టీమ్ అదరగొట్టి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో #TeamIndia యాష్ ట్యాగ్ పాపులర్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, IPL 2020, Ms dhoni, Narendra modi, PM Narendra Modi, Twitter, Virat kohli