హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India: టీమ్ ఇండియా ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. అతడికి జట్టులో చోటు కల్పించిన సెలెక్టర్లు

Team India: టీమ్ ఇండియా ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. అతడికి జట్టులో చోటు కల్పించిన సెలెక్టర్లు

హనుమ విహారిని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు

హనుమ విహారిని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు

Team India: టీమ్ ఇండియాను పలుమార్లు టెస్టు మ్యాచ్‌లలో ఓటమి నుంచి గట్టెక్కించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ప్రతీసారి చుక్కెదురవుతున్నది. ఎంత మంచి ప్రదర్శన చేసినా జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. తాజాగా అతడిని న్యూజీలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

టీమ్ ఇండియాలో (Team India) స్థానం కోసం ఎంతో మంది చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. వారిలో కొంత మందికి జట్టులో చోటు దక్కిన తర్వాత పేలవ ఫామ్ కారణంగా స్థానం కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే టెస్టు జట్టులో తనను తాను నిరూపించుకున్నా.. జట్టులో స్థానం మాత్రం పర్మనెంట్ చేసుకోలేకపోయిన క్రికెటర్ మాత్రం హనుమ విహారి (Hanuma Vihari) అని చెప్పవచ్చు. టీమ్ ఇండయాను పలుమార్లు ఓటమి నుంచి గట్టెక్కించిన విహారీకి ప్రతీ సిరీస్ ముందు జట్టులో స్థానం ఉంటుందో లేదో అనే బెంగే ఎక్కువ. గత ఏడాది చివరిలో భారత జట్టు ఆస్ట్రేలియాలో (Australia) పర్యటించిన భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ పర్యటనలో సిడ్నీ టెస్టులో భారత జట్టు ఓటమి పాలవకుండూ వీరోచితంగా పోరాడిన హనుమ విహారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలసి గాయాన్ని సైతం లెక్కచేయకుండా రోజంతా క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత అతడికి సరైన అవకాశాలు రాలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన జట్టులో ఉన్నా.. ఆ టెస్టు ఆడలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ హనుమ విహారిని పక్కన పెట్టారు.

ఇలా ప్రతీసారి తెలుగు వాడైన విహారీకి జట్టులో స్థానం దక్కడం గగనంగా మారింది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న పలువురు క్రికెటర్లకు తుది జట్టులో స్థానం దక్కుతున్నా.. విహారికి మాత్రం అవకాశాలు రాకపోవడంపై ఫ్యాన్స్ అప్పట్లోనే సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా న్యూజీలాండ్‌తో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా విహారిని ఎంపిక చేయలేదు. దీంతో ఫ్యాన్స్ మరోసారి బీసీసీఐపై ఫైర్ అయ్యారు. విహారిని ఏ కారణం చేత టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదని బోర్డును ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ ప్రాతిపదికన జట్టును ఎంపిక చేశారంటూ ధ్వజమెత్తారు. విహారిని తప్పించడానికి కారణం కూడా సెలెక్షన్ కమిటీ చెప్పలేదు. దీంతో క్రికెట్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

KS Bharat: ఇండియా టెస్టు జట్టుకు ఎంపికైన కేఎస్ భరత్ గురించి మీకు తెలియని విషయాలు ఇవే..!


ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే కూడా విహారిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. విమర్శలు పెరిగిపోతుండటంతో బోర్డు మేల్కొన్నది. వెంటనే శుక్రవారం ఒక ట్వీట్ చేసింది. హనుమ విహారిని ఇండియా ఏ టీమ్‌లో చేర్చామని.. అతడు త్వరలోనే దక్షిణాఫ్రికాతో జరిగి సిరీస్‌లో ఆడతాడని చెప్పింది. కాగా, గతంలోనే బోర్డు ఇండియా ఏ జట్టును ప్రకటించింది. కానీ అందులో విహారి పేరు లేదు. కానీ క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు తట్టుకోలేక చివరకు అతడిని చేరుస్తున్నట్లు పేర్కొన్నది.

First published:

Tags: Bcci, India vs newzealand, Team India

ఉత్తమ కథలు