హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli : ఇది మాములు వాడకం కాదు భయ్యా.. కోహ్లీ డకౌట్ ని ఇలా వాడేసిన సజ్జనార్..

Virat Kohli : ఇది మాములు వాడకం కాదు భయ్యా.. కోహ్లీ డకౌట్ ని ఇలా వాడేసిన సజ్జనార్..

Virat Kohli

Virat Kohli

Virat Kohli : ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆర్టీసీని ప్రమోట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ ఫోటోతో ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఇంకా చదవండి ...

  ఐపీఎస్ అధికారి సజ్జనార్ (V.C. Sajjanar).. ఈ పేరు తెలంగాణ (Telangana)లో తెలియని వారు చాలా తక్కువ. టీవీలు చూస్తూ.. నిత్యం పైపైన వార్తలు ఫాలో అయ్యే వారికి కూడా ఈ పేరు సుపరిచితమే. ఈ ఐపీఎస్ అధికారి పేరు వినగానే వరంగల్ లో కాలేజీ యువతులపై యాసిడ్ దాడి చేసిన నిందితుల ఎన్ కౌంటర్, షాద్ నగర్ లో దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు ఘటనలు సజ్జనార్ కు తెలుగు రాష్ట్రాల్లో హీరో ఇమేజ్ ను తీసుకువచ్చాయి. పోలీస్ అంటే సజ్జనార్ లాగా ఉండాలనేలా చేశాయి ఈ రెండు ఎన్ కౌంటర్లు. ఇది ఇలా ఉంటే.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమించింది తెలంగాణ సర్కార్. దీంతో.. ఖాకీ యూనిఫాంకు తాత్కాలిక విరామం ఇచ్చిన సజ్జనార్ ఆర్టీసీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు సాధ్యమైనన్ని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. ఫీల్డ్ లో ప్రయాణిస్తూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు సజ్జనార్.

  ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆర్టీసీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా… రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)పై ట్వీట్‌ చేశారు. విరాట్‌ కోహ్లీ ఫోటో వాడుకుని..ఆర్టీసీ క్రేజ్‌ పెంచే ప్రయత్నం చేశారు సజ్జనార్‌. గోల్డెన్ డకౌట్ అయిన తరువాత విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను వాడేశారు.

  ఆ ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడిన ఓ ఫొటోను టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై ట్వీట్ చేశారు. బస్ పాస్‌ల కోసం దీన్ని వినియోగించుకున్నారు. కండక్టర్ వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మర్చిపోయిన మన రియాక్షన్.. అంటూ దానికి ట్యాగ్ లైన్ జోడించారు. మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారా?.. అలాంటి సందర్భాన్ని పంచుకోవాలని సజ్జనార్ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

  ఇక, విరాట్ కోహ్లీ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్ నమోదు చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియర్ దారి పట్టాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. రెండో ఓవర్‌‌ను సంధించిన దుష్మంత చమీర బ్యాక్ అండ్ బ్యాక్ రెండు వికెట్లు నేలకూల్చాడు. అయిదో బంతికి అనూజ్ రావత్ అవుట్ అయ్యాడు.

  ఆరో బంతిని విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అతను సంధించిన బంతిని షాట్ ఆడబోయిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి కాస్తా బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న దీపక్ హుడా చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోరు ఏడు పరుగులే.

  గోల్డెన్ డకౌట్ తరువాత విరాట్ కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. నిర్వేదంతో కూడిన ఓ నవ్వు నవ్వుతూ వెనక్కి మళ్లాడు కోహ్లీ. నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిని అనుభవించినట్లు కనిపిస్తోంది కోహ్లీ. జరిగిందేదో అర్థం చేసుకునే లోపే విరాట్ కోహ్లీ పెవిలియన్ దారి పట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, Royal Challengers Bangalore, Sajjanar, Tsrtc, Virat kohli

  ఉత్తమ కథలు