Home /News /sports /

TRENT BOULT HIT SIX ON LAST BALL TO WIN FOR NORTHERN DISTRICTS AGAINST CANTERBURY IN SUPER SMASH WATCH VIDEO JNK

Trent Boult: ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి.. అక్కడ ఉన్నది ట్రెంట్ బౌల్ట్.. ఆఖరుకు ఏమయ్యిందంటే..

ఆఖరు బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన ట్రెంట్ బౌల్ట్ (PC: NZ Cricket)

ఆఖరు బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన ట్రెంట్ బౌల్ట్ (PC: NZ Cricket)

Trent Boult Viral Video: సూపర్ స్మాష్ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ తన జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ట్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చివరి బంతికి అద్భుత సిక్సర్ బాది జట్టుకు సంబరాలు చేసుకునే అవకాశం ఇచ్చాడు. బోల్ట్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
    ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం క్రికెట్‌లో (Cricket) ఈ మధ్య సహజంగా మారిపోయింది. ఎలాంటి బౌలర్ (Bowler) వేసినా బ్యాటర్ (Batter) అలవోకగా బౌండరీ అవతలకు బంతిని తరలించి విజయాలను అందిస్తున్నాడు. అయితే ఈ సారి సిక్స్ (Six) కొట్టింది మాత్రం బౌలర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ (New Zealand) స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒకే ఒక్క అర్ధ సెంచరీని సాధించాడు. అయితే అతను గురువారం చేసిన ఫీట్ నిజంగా ఆశ్చర్యం కలిగించింది. సూపర్ స్మాష్ టోర్నమెంట్‌లో బోల్ట్ చివరి బంతికి సిక్సర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. నార్తర్న్ డిస్ట్రిక్స్ జట్టుకు చివరి బంతికి ఆరు పరుగులు అవసరం అయ్యాయి. విశేషం ఏంటంటే ట్రెంట్ బౌల్ట్ బ్యాటింగ్ చేస్తుండటంతో విజయంపై ఎవరికీ ఆశలు లేవు. కానీ అతడు చివరి బంతికి అద్భుతమైన సిక్స్ బాది అందరినీ ఆశ్చర్యపర్చడమే కాకుండా విజయం కూడా అందించాడు.

    అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లోనే నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. అయితే బౌల్ట్ కాంటర్‌బరీ విజయ కలను బ్రేక్ చేశాడు. కాంటర్‌బరీ జట్టు 17.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. ఇలాంటి పరిస్థితుల్లో నార్తర్న్ జట్టు పటిష్టంగా కనిపించినా లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగానే కష్టపడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో నార్తర్న్ జట్టు 5 వికెట్లకు 98 పరుగుల వద్ద ఆడుతున్నప్పటికీ 6 బంతుల్లోనే తదుపరి 4 వికెట్లను కోల్పోయింది. ఎడ్ నాటల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి 2 బంతుల్లోనే 2 వికెట్లు పడ్డాయి. అనురాగ్ వర్మను, ఆపై ఇష్ సోధి (2)ని బలిపశువును చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి జో వాకర్ (0) కూడా పెవిలియన్ బాట పట్టాడు.

    PKL 8: ప్రో కబడ్డీ లీగ్‌లో పాట్నా పైరేట్స్ ఉత్కంఠ విజయం.. దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ సునాయాస విజయాలు







    ఇన్నింగ్స్ చివరి బంతికి విజయానికి 6 పరుగులు చేయాల్సి ఉంది. ట్రెంట్ బౌల్ట్ నాటల్ వేసిన బంతిని ఎదుర్కొన్నాడు. ఆ బంతిని ట్రెంట్ బౌల్ట్ ఏరియల్ షాట్ ఆడాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ దాటింది. రెండు బంతులు ఆడి 7 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో బౌల్ట్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఆఖరు వరకు ఉత్కంఠభంగా సాగిన ఈ మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్స్ జట్టు 1 వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Cricket, T20

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు