Home /News /sports /

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వదిలేసిన ట్రెంట్ బౌల్ట్.. ఎందుకు వదిలేశాడో సెటైర్ వేసిన స్కై

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వదిలేసిన ట్రెంట్ బౌల్ట్.. ఎందుకు వదిలేశాడో సెటైర్ వేసిన స్కై

బౌల్ట్ క్యాచ్ వదిలేయడంపై సెటైర్ వేసిన సూర్యకుమార్ యాదవ్ (PC: BCCI)

బౌల్ట్ క్యాచ్ వదిలేయడంపై సెటైర్ వేసిన సూర్యకుమార్ యాదవ్ (PC: BCCI)

SuryaKumar Yadav: టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో గెలిపించాడు. అయితే ఆ మ్యాచ్‌లో సూర్య క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ వదిలేశాడు. దీనిపై సూర్య సైటైర్ వేశాడు.

    టీమ్ ఇండియా (Team India) బ్యాటర్ సూర్యకుమార్ (Suryakumar Yadav) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జైపూర్‌లో జరిగిన తొలి టీ20లో (T20 ) జట్టును గెలిపించాడు. కేవలం 40 బంతుల్లో 62 పరుగులు చేయడంతో న్యూజీలాండ్‌పై (New Zealand) భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. క్రీజులోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి న్యూజీలాండ్ బౌలర్లపై చెలరేగిన స్కై బౌండరీలు, సిక్సులత అలరించాడు. భారత జట్టు కేఎల్ రాహుల్ (KL Rahul) వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మతో (Rohit Sharma)  కలసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. రోహిత్ అవుటైన తర్వాత కూడా సూర్యకుమార్ తన దూకుడును కొనసాగించాడు. అయితే సూర్య 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ వద్ద ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఆ క్యాచ్‌ను మిస్ చేశాడు. అంతే కాకుండా ఆ బాల్ బౌండరీ వైపు దూసుకొని వెళ్లింది. బౌల్ట్ క్యాచ్ మిస్ చేసిన కాసేపటికే సూర్య అతడి బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ టీమ్ ఇండియాను విజయం దిశగా నడిపించాడు.

    మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ పలు విషయాలు పంచుకున్నాడు. 'నేను ఈ మ్యాచ్‌ను పూర్తి చేయాలని అనుకున్నాను. కానీ ఆఖరిలో అవుట్ కావడం బాధగా అనిపించింది. కానీ చివరకు విజయం సాధించడం చాలా సంతోషంగా అనిపించింది.' అని అన్నాడు. కాగా, ట్రెంట్ బౌల్ట్ అతడి క్యాచ్ మిస్ చేయడంపై స్పందన ఏంటని అతడిని విలేకరులు ప్రశ్నించగా సెటైరికల్‌గా రిప్లై ఇచ్చాడు. 'ఆ క్యాచ్ నా భార్యకు నా ముంబై ఇండియన్ టీమ్ మేట్ ఇచ్చిన గిఫ్ట్' అని సమాధానం చెప్పగానే అక్కడ నవ్వులు వెల్లివిరిసాయి. కాగా, గత కొంత కాలంగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా అతడికి టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కింది. ఆ ఈవెంట్‌లో మొత్తం 42 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, సీనియర్లు మిస్ అయిన సమయంలో న్యూజీలాండ్ సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు.

    U19 World Cup: వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న న్యూజీలాండ్.. కారణం ఇదే.. గ్రూప్ బిలో టీమ్ ఇండియా







    విరాట్ కోహ్లీ లేకపోవడంతో నెంబర్ 3లో సూర్యకుమార్ బరిలోకి దిగాడు. గత ఫామ్‌ను మరిపించేలా దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. గత మూడు నాలుగేళ్లుగా నేను ఇలాగే రాణిస్తున్నాను. మధ్యలో కొన్ని మ్యాచ్‌లు సరిగా ఆడకపోయినా.. నెట్స్‌లో నా టెక్నిక్ లోపాలను సరి చేసుకొని తిరిగి బరిలోకి దిగాను. ఫామ్‌లోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. నేను మిడిల్ ఆర్డర్‌లో ఆడటం కూడా నాకు కలసి వస్తున్నది అని సూర్యకుమార్ అన్నాడు. ఇక ఈ రోజు ఇన్నింగ్ తన భార్య పుట్టిన రోజు సందర్భంగా తనకు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు చెప్పాడు.
    Published by:John Kora
    First published:

    Tags: India vs newzealand, Mumbai Indians, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు