• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • TRADE BEN STOKES TO MUMBAI INDIANS FAN ASKS RAJASTHAN RR RESPONSE IS HILARIOUS SA

IPL 2021: ముంబైకి బెన్‌ స్టోక్స్‌.. అభిమానికి రాజస్థాన్‌ పంచ్!.

IPL 2021: ముంబైకి  బెన్‌ స్టోక్స్‌..  అభిమానికి రాజస్థాన్‌  పంచ్!.

బెన్ స్టోక్స్ (Image:IPL)

రాయల్స్ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను కొనుగొలు చేయాలని దళపతి విగ్నేశ్వరన్ అనే అభిమాని కోరారు. దీంతో రాజస్థాన్‌ ఆ అభామానికి తనదైన శైలిలో పంచ్ ఇచ్చింది.  స్టోక్స్‌ను ఇచ్చే ప్రసక్తే లేదంటూ రాజస్థాన్‌ తేల్చి చెప్పింది. నో.. నో ఎమోజీని రీ ట్వీట్‌ చేసింది.

  • Share this:


    ఐపీఎల్ సన్నహాలు అప్పుడే మెుదలయ్యాయి. ఫిబ్రవరి 18 జ‌ర‌గ‌బోయే మినీ వేలంతో ఐపీఎల్ 2021కి అంకుర్పారణ జరగనుంది.  ఈ మినీ వేలానికి ఫ్రాంచైజీలన్ని సిద్ధమ‌వుతున్నాయి. ఇటీవలే రిటైన్‌, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ళ జాబితాను కూడా ప్రకటించాయి.  అలాగే కావాల్సిన ఫ్లేయర్స్‌ను ఇన్‌సైడ్ ట్రెడింగ్ ద్వారా తీసుకుంటున్నాయి. ఇలానే ఉతప్పను చెన్నై కొనుగొలు చేయగా డేనియల్ సామ్స్‌,హర్షల్ పటేల్‌ను బెంగళూర్ కొనగొలు చేసింది. ఇక ముంబై కూడా రాజస్థాన్‌ రాయల్స్ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను కొనుగొలు చేయాలని దళపతి విగ్నేశ్వరన్ అనే అభిమాని కోరారు. దీంతో రాజస్థాన్‌ ఆ అభామానికి తనదైన శైలిలో పంచ్ ఇచ్చింది.  స్టోక్స్‌ను ఇచ్చే ప్రసక్తే లేదంటూ రాజస్థాన్‌ తేల్చి చెప్పింది. నో.. నో ఎమోజీని రీ ట్వీట్‌ చేసింది.





    ఇక ఐపీఎల్ 2021 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వదులుకుంది. ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు స్మిత్‌కు తమ అధికారిక ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపింది. రాజస్థాన్ టీమ్ కు సేవలు అందించనందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తమ జట్టుకు టీమిండియా యంగ్ గన్ సంజూ శామ్సన్ నయా కెప్టెన్ గా నియమించింది. ఐపీఎల్ లో ముంబై, ఢిల్లీ ఎలాగైతే కుర్రాళ్లను కెప్టెన్లు చేసి విజయాల బాట పట్టాయో..అలాగే సంజూ శామ్సన్ కూడా తమ జట్టును విజయతీరాలకు చేరుస్తాడన్న నమ్మకంలో ఉంది రాజస్థాన్. రాజస్థాన్ బ్యాటింగ్ లో సంజూ శామ్సన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పితే మరింత బాధ్యతగా ఆడతాడని రాజస్థాన్ యజమాన్యం భావిస్తోంది.

    ఇక 2008లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. 2018లో స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. కానీ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్మిత్ ఐపీఎల్‌కు దూరం కావడంతో.. అంజిక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2019లో స్మిత్ తిరిగి జట్టులో చేరినప్పటికీ.. కెప్టెన్‌గా రహానే వ్యవహరించాడు.
    Published by:Rekulapally Saichand
    First published: