ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నజరానా ప్రకటించారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణ పతకం (Gold medal) సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen)కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revant Reddy) రూ.5 లక్షల నజరానా (Gift) ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నిజామాబాద్ (Nizamabad) నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని రేవంత్ ప్రశంసించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పారితోషికం ఇచ్చినట్లు నిఖత్ జరీన్‌కు కూడా అందించాలని సీఎం కేసీఆర్ (CM KCR)ను ఆయన కోరారు.
On behalf of @INCTelangana
I announce Rs 5 lakh to @nikhat_zareen as a token of appreciation for her commendable achievement.
Her journey from Nizamabad to Istanbul will inspire many.
నిఖత్ జరీన్ (Nikhat Zareen).. ప్రపంచానికి ఆడపిల్లల పంచ్ పవర్ ఏంటో చూపించిన తెగువ కలిగిన యువతి. వరల్డ్ బాక్సింగ్ పోటీల్లో (In world boxing competitions) గోల్డ్ మెడల్ సాధించి జయహో జరీన్ అనిపించుకుంది. దేశానికి, రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఏ ఒక్కరూ పుట్టుకతోనే గొప్పవాళ్లు కాదు. అలాగని ప్రయత్నం చేయకుండా ఓ ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరు. జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించుకోవడం అంటే ఎన్నో ఆటుపోటులు, ఎదురుదెబ్బలు,అపజయాలు, చిన్నచూపులు అవమానాలు భరిస్తూ ముందుకెళ్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని నిఖత్ జరీన్ నిరూపించారు. సమాజంలో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యే వరకు అడుగడుగున ఆంక్షలు, అణచివేతకు గురి చేసే ఈ సమాజంలో తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో పుట్టి బాక్సింగ్‌లో ప్రపంచ విజేతగా నిలవడం అనేది అంత సులువైన విషయం కాదు.
52 కేజీల విభాగంలో..
నిజామాబాద్ జిల్లా ఇందూరుకి చెందిన నిఖత్ జరీన్ నేటి తన కలను సాకారం చేసుకోవాలని చిన్ననాటి నుంచే ప్రయత్నం చేసింది. పట్టుదల, క్రమశిక్షణతో బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్దిని తన పంచ్ పవర్‌తో ఎలా పడగొట్టాలి అని తర్ఫీదు పొందారు. టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ పోటీల్లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్ దేశానికి చెందిన జిటింగ్ జుటామస్ పై గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకొని దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పింది నిఖత్ జరీన్. సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ (World Boxing Championship) లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది నిఖత్ జరీన్.
నిజామాబాద్‌లో..
నిఖత్ విజయంతో నిజామాబాద్ జిల్లాలోని క్రీడా విభాగం నాయకులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌కు చెందిన జమీల్ అహ్మద్ కు ముగ్గురు కూతుళ్లు. చిన్నకుమార్తె నిఖత్ జరీన్. 1990 జూన్ 14వ జన్మించిన నిఖత్ జరీన్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు నిర్మల్ హృదయ్ స్కూల్లో చదివారు. ఇంటర్ విద్యను కూడా నిజామాబాద్‌లోనే పూర్తి చేసింది ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్.
హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసిన జరీన్ ప్రస్తుతం ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా మాసబ్ ట్యాంక్ బ్రాంచిలో గతేడాది ఉద్యోగంలో చేరింది. 8వ తరగతి నుంచి తండ్రితో వాకింగ్‌కి వెళ్లిన సమయంలో బాక్సింగ్ కోచ్ షంసముద్దీన్ అబ్బాయిలకు కొచింగ్ ఇవ్వడం చూశారు. తాను కూడా బాక్సింగ్ నేర్చుకుంటానని తండ్రి జమీల్‌ను కోరడంతో కూతురి కోరికను మొదట కష్టంగా భావించినప్పటికి కాదనలేక ఆమెలోని ఆసక్తిని ప్రోత్సహించారు. ఆ ప్రయత్నంలో భాగమే నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు నిఖత్ జరీన్.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.